English | Telugu

మ‌న‌కున్న నేచ‌ర‌ల్ స్టార్ నాని- వెంక‌టేష్‌

on Apr 16, 2019

 

`నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంట‌గా న‌టించిన చిత్రం `జెర్సీ`. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సినిమాను సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మాత‌. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌కుడు. ఈ కార్య‌క్ర‌మంలో నాని క్రికెట్ ప్రాక్టీస్ చేసే వీడియో మోహ‌న చెరుకూరి చేత‌లు మీదుగా విడుద‌లైంది. వెంక‌టేష్ తొలి టిక్కెట్ ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్ మాట్లాడుతూ...`` క్రికెట్ ఇష్టం కాబ‌ట్టి ఇక్క‌డికి రాలేదు. చాలా జెన్యూన్ గా, ప్రేమ‌గా ఇక్క‌డికి వ‌చ్చాను. జెర్సీ ఫ‌స్ట్ లుక్ వ‌చ్చిన‌ప్పుడే చాలా ఇంప్రెస్ అయ్యాను. గౌత‌మ్ చాలా క్లారిటీగా ఏం చూపించాల‌నుకున్నాడో అది చూపించాడు. ట్రైల‌ర్ చూసాక మైండ్ బ్లోయింగ్ గా అనిపించింది.  జెన్యూన్ సినిమాలు చాలా రేర్ గా వ‌స్తాయి. నానిని ఇలాంటి సినిమాలో చూసే వారికి చాలా బాగా అనిపించింది. ఇలాంటి పాత్ర‌ల్లో న‌టించేట‌ప్పుడు చాలా ఎమోష‌న‌ల్ గా ఇన్వాల్వ్ అవుతుంటాం. అందుకే ట్రైల‌ర్ చూడ‌గానే ఈ త‌ర‌హా సినిమాలు స్పూర్తిగా అనిపిస్తాయి. ప్ర‌తిఒక్క‌రూ హీరో పాత్ర చూసి ఇన్ స్పెయిర్ అవుతారు. ప్ర‌తి ఒక్క‌రూ లైఫ్ లో స్ట్ర‌గుల్ అవుతుంటారు. అలాంటప్పుడు జీవితంలో మ‌నం వ‌దిలేయ‌కూడ‌దు. గ‌ట్టిగా ప్ర‌య‌త్నించి స‌క్సెస్ సాధించాల‌ని ఈ సినిమా చూసిన త‌ర్వాత ప్ర‌తి ఒక్క‌రూ అనుకుంటారు. ఇది కేవ‌లం సినిమా మాత్ర‌మే కాదు. లైఫ్ లెస‌న్ అని అర్థం చేసుకుంటాం. సినిమా అవుట్ స్టాండింగ్ గా ఉంటుంది. నిర్మాత‌లు నాకు చాలా మంచి మిత్రులు. ద‌ర్శ‌కుడికి కంగ్రాట్స్. నానిని చూస్తే గ‌ర్వంగా ఉంటుంది. త‌ను మ‌న‌కున్న నేచుర‌ల్ స్టార్`` అన్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here