వెంకటేష్ నయనతార..సంతోషం సగం బలం
on Jul 28, 2015
సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువ. ఒక కాంబినేషన్ సక్సెస్ అయిందంటే మళ్లీ మళ్లీ వాళ్లతో సినిమాలు తీయడానికి రెడీ అయిపోతారు. ఓ హీరో హీరోయిన్ కు హిట్ పెయిర్ అని పేరొచ్చిందంటే కచ్చితంగా ఆ కాంబినేషన్లో ఇంకో సినిమా తయారవుతుంది. లక్ష్మీ సినిమాతో జత కట్టిన వెంకటేష్, నయనతార మంచి జంటగా పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత ‘తులసి’ సినిమాలోనూ జోడీగా కనిపించారు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమాకు రంగం సిద్ధమవుతోంది.
ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి మంచి సినిమాలతో దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన క్రాంతి మాధవ్.. ఇటీవలే వెంకటేష్ కు ఓ కథ చెప్పి ఓకే చేయించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు హీరోయిన్ గా రకరకాల ఆప్షన్స్ పరిశీలించి చివరికి నయనతారను ఓకే చేసినట్లు సమాచారం. కంటెంట్ ఉన్న దర్శకుడికి.. మంచి పెయిర్ దొరికిన నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు మొదలైపోయాయి.