English | Telugu

ఇమేజ్ గురించి ఆలోచించ‌ను - వెంక‌టేష్‌

on Jan 10, 2019

 

`గురు` త‌ర్వాత విక్ట‌రి వెంక‌టేష్ న‌టించిన చిత్రం ` ఎఫ్ 2`. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్ అనేది ట్యాగ్ లైన్. దిల్ రాజు బేన‌ర్ లో అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. వ‌రుణ్ తేజ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా ఈ నెల 12 విడుద‌ల కానుంది.  ఈ సంద‌ర్భంగా హీరో వెంక‌టేష్ మీడియాతో మ‌ట్లాడారు.  ఆ విశేషాలు..
 
 విభిన్న మైన చిత్రాలే చేయాల‌ని డిసైడ్ అయ్యారా?

`గురు` త‌ర్వాత చాలా స్క్రిప్టులు విన్నాను.  కానీ , ఏవీ కుద‌ర‌లేదు. ఈ స్క్రిప్ట్ బాగా న‌చ్చింది. నా శైలిలో ఉంటూనే క‌థ కొత్త‌గా ఉంటుంది.  యంగ్ హీరోతో క‌లిసి వ‌ర్క్ చేయ‌డం ఒక మంచి అనుభూతి ఉంటుంది. వారి నుంచి మ‌నం నేర్చుకోవ‌చ్చు.  మ‌న గురించి వారికి తెలుసుకునే అవ‌కాశం ఉంటుంది. నేను, వ‌రుణ్ తోడ‌ళ్లుళ్లుగా న‌టించాం. బిఫోర్ మేరేజ్, ఆఫ్ట‌ర్ మేరేజ్ వంటి అంశాలు బావుంటాయి.
 
ఇందులో మెసేజ్ ఏమైనా ఉంటుందా?

మ్యారేజ్ గురించి, వైఫ్స్ మ‌నం ఎంత స‌ర‌దాగా మాట్లాడుకున్నా కానీ, ఆడ‌వారు లేనిది ఈ సృష్టి లేదు. ఆడ‌వాళ్ల గొప్ప‌త‌నాన్ని మ‌నం గుర్తించాలి  అన్న‌ది అంత‌ర్లీనంగా ఉంటుంది.

చాలా గ్యాప్ త‌ర్వాత సంక్రాంతి బ‌రిలో ఉన్న‌ట్టున్నారు?


  అవును ..సంక్రాంతి పండ‌క్కి నా సినిమా రాక చాలా కాలమైంది. ఈ సినిమా రావ‌డం చాలా హ్యాఫీగా ఉంది. ఎఫ్ 2 ప‌క్కా ఫ్యామిలీ సినిమా. సినిమాలు బావుంటే ఫ్యామిలీ అంతా థియేట‌ర్ కు వ‌చ్చి సినిమాలు చూస్తున్నారు. ఈ సినిమాలో లీనమై న‌టించాను.

ద‌ర్శ‌కుడు అనిల్ గురించి చెప్పండి?

అనిల్ మంచి రైట‌ర్ కావ‌డంతో ఎక్క‌డైనా, ఏదైనా పంచ్ కావాల‌నిపించినా వెంట‌నే ప‌క్క‌కెళ్లి రాసుకునేవాడు, నా గ‌త సినిమాల‌న్నీ స్ట‌డీ చేసి నాకు ఇందులో మంచి పాత్ర డిజైన్ చేశాడు.

 వ‌రుణ్ తేజ్ తో వ‌ర్క్ చేయ‌డం ఎలా అనిపించింది?

వ‌రుణ్ త‌క్కువ టైమ్ లో చాలా కలిసిపోయాడు. ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకుండా త‌నదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. తెలంగాణ యాస‌లో మాట్లాడాడు. చాలా బాగా చేశాడు.

 ఫ‌లానా పాత్ర చేయ‌లేదే అన్న ఫీలింగ్ ఉందా?

ఎప్పుడూ ఫ‌లానా అని కోరుకోను. నాలోని న‌టన‌ని పూర్తి స్థాయిలో ప్ర‌ద‌ర్శించే క్యార‌క్ట‌ర్స్ కోసం ఎదురు చూస్తున్నా. నాకు అమీర్ ఖాన్, అమితాబ్ లాంటి సినిమాలు చేయాల‌ని ఉంది.

ఎప్పుడూ చాలా ఫిల్ గా ఉంటారు ఎలా?

ప్ర‌తిక్ష‌ణం లైఫ్‌ని ఆస్వాదిస్తాను. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ఉంటాను. బ‌య‌ట విష‌యాలు పెద్ద‌గా ప‌ట్టించుకోను. సూర్యోద‌యాన్ని ప్ర‌తి రోజు చూస్తాను. ప్ర‌కృతితో ఎక్కువ‌గా మ‌మేక‌మై ఉంటాను. అంద‌రూ బాగుండాల‌న్న పాజిటివ్ ఆలోచ‌న‌లో ఉంటాను.


సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య యాక్టివ్ గా ఉంటున్నారు?

మిగిలిన వాటితో పోలిస్తే నాకు ఇన్ స్టాగ్రామ్ చాలా న‌చ్చింది.  నేను ఎక్కువ‌గా ఫొటోగ్ర‌ఫీని ఇష్ట‌ప‌డ‌తాను. ప్ర‌కృతిని తీసిన ఫొటోల‌ను ఇన్ స్టాలో పోస్ట్ చేస్తుంటాను.


మీ త‌దుప‌రి చిత్రాల వివ‌రాలు?

చైతుతో క‌లిసి `వెంకీమామ‌` చేస్తున్నా. అలాగే త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా ఉంది. అనిల్ రావిపూడి మ‌ర‌లా మ‌రో క‌థ రెడీ  చేస్తున్నాడు. వెంకీ మామ‌లో మంచి పాత్ర‌. చైతు పాత్ర కూడా చాలా బావుంటుంది.

  ఇమేజ్ గురించి ఆలోచిస్తారా?

నాకు ఎప్పుడూ ఇమేజ్ అనేది అర్థం కాదు. నాకు సినిమా అనేది వ్యాపారం మాత్ర‌మే. ఇమేజ్ మ‌నం అనుకుంటే వ‌చ్చేది కాదు. అంత‌కు మించింది. ప్ర‌జ‌లు ఇవ్వాల్సింది.  కాబ‌ట్టి దాని గురించి ఆలోచించ‌ను. నాతో సినిమా తీసిన నిర్మాత‌లు, పంపిణీదారులు బావుండాలి అనుకుంటాను.


Also ReadLatest NewsCustomer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here