హాట్ స్టార్ లో దృశ్యం 2.. రిలీజ్ ఎప్పుడంటే?
on Jul 27, 2021
వెంకటేష్ నటించిన 'నారప్ప' మూవీ రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో నేరుగా విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ్ సూపర్ హిట్ మూవీ 'అసురన్'కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో వెంకటేష్ నటనకి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉంటే వెంకటేష్ నటించిన మరో రీమేక్ మూవీ కూడా త్వరలో విడుదల కానుంది.
మలయాళ సూపర్ హిట్ మూవీ 'దృశ్యం 2'ను వెంకటేష్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మలయాళ 'దృశ్యం 2' డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంది. తెలుగు 'దృశ్యం 2' కూడా నేరుగా ఓటీటీలోనే విడుదల కానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్ భారీ మొత్తం చెల్లించి ఈ సినిమాను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 10 న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుందని సమాచారం.
'దృశ్యం 2'లో వెంకటేష్, మీనా జంటగా నటించారు. మలయాళ వెర్షన్‌ని తెరకెక్కించిన జీతూ జోసెఫ్ తెలుగు వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మించారు.