వెంకీ బర్త్ డే స్పెషల్ గా నారప్ప టీజర్?
on Nov 28, 2020
డిసెంబర్ 13.. విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నిరుడు వెంకీ గత చిత్రం వెంకీమామని రిలీజ్ చేసింది తన హోమ్ బేనర్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. కట్ చేస్తే.. ఈ సంవత్సరం కూడా అదే తేదికి వెంకీ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చేందుకు సదరు దిగ్గజ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోందట.
ఆ వివరాల్లోకి వెళితే.. తమిళనాట ఘనవిజయం సాధించిన అసురన్ చిత్రం తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ రోల్ లో వెంకటేష్ నటిస్తుండగా.. అతని జోడీగా సుందరమ్మ పాత్రలో ప్రియమణి దర్శనమివ్వనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ తో పాటు కోలీవుడ్ నిర్మాణ సంస్థ వి క్రియేషన్స్ జాయింట్ గా నిర్మిస్తోంది. దాదాపు 75 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. లాక్ డౌన్ అనంతరం ఇటీవలే మళ్ళీ పట్టాలెక్కింది. 2021 ఆరంభంలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఈ నేపథ్యంలోనే.. వెంకీ బర్త్ డే స్పెషల్ గా డిసెంబర్ 13న నారప్ప టీజర్ ని విడుదల చేసేందుకు ప్రణాళిక రచించారట.
మరి.. ఈ రీమేక్ తో వెంకీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటారో చూడాలి.