వెంకీ.. బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్!
on Feb 22, 2021
`ఎఫ్ 2`, `వెంకిమామ` విజయాలతో విక్టరీ వెంకటేశ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒకవైపు ఆ విజయాలను ఆస్వాదిస్తూనే.. మరోవైపు వరుస చిత్రాలతో ముందుకు సాగుతున్నారు. ఈ వేసవిలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ `నారప్ప` థియేటర్స్ లో సందడి చేయనుంది. ఆ తరువాత మాత్రం ఆయన బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ తో సందడి చేయనున్నారు. ఆ సీక్వెల్స్ నే.. `దృశ్యం 2`, `ఎఫ్ 3`. తక్కువ గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఆ వివరాల్లోకి వెళితే.. `దృశ్యం`కి సీక్వెల్ గా తెరకెక్కనున్న `దృశ్యం 2` మార్చిలో పట్టాలెక్కి జూన్ లేదా జూలైలో జనం ముందుకు రానుందని టాక్. ఇక `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3` ఆగస్టు 27న థియేటర్స్ లో సందడి చేయనుంది. దీంతో.. బ్యాక్ టు బ్యాక్ సీక్వెల్స్ తో వెంకీ పలకరించబోతున్నట్లవుతోంది. మరి.. ఈ సీక్వెల్స్ వెంకీకి ఎలాంటి ఫలితాలను, గుర్తింపుని అందిస్తాయో చూడాలి.
కాగా, `దృశ్యం 2`ని జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేయనుండగా.. `ఎఫ్ 3`ని అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు.