వెంకీకి కూడా వర్కవుట్ అవుతుందా?
on Jan 15, 2021
తెలుగునాట రీమేక్స్ తో సంచలన విజయాలు అందుకున్న కథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ముందుంటారు. ఈ సీనియర్ స్టార్ చేసిన రీమేక్స్ లో సింహభాగం సక్సెస్ అయ్యాయి. అంతేకాదు.. వెంకీ చేసిన స్ట్రయిట్ సబ్టెక్ట్స్ వేరే భాషల్లో రీమేక్ అయి విజయం సాధించిన వైనాలు కూడా ఉన్నాయి. అలా విజయం సాధించిన సినిమాల్లో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఒకటి. తమిళంలో ఈ సినిమాని యారాడి నీ మోహిని పేరుతో కోలీవుడ్ స్టార్ ధనుష్ రీమేక్ చేశాడు. నయనతార హీరోయిన్ గా నటించిన సదరు సినిమా తమిళ తంబీల ఆదరణ పొందింది. వెంకీ సినిమాని ధనుష్ రీమేక్ చేసిన సందర్భం ఇదొక్కటే కావడం గమనార్హం.
కట్ చేస్తే.. ఇప్పుడు ధనుష్ నటించిన అసురన్ ని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేస్తున్నాడు వెంకీ. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ వేసవిలో సందడి చేయనుంది. మరి.. ధనుష్ కి వెంకీ సబ్జెక్ట్ అచ్చొచ్చినట్టే.. వెంకీకి ధనుష్ సినిమా కూడా వర్కవుట్ అవుతుందేమో చూడాలి.
నారప్పలో ప్రియమణి నాయికగా నటిస్తుండగా.. మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
