వరుణ్ తేజ్ కోసం హాలివుడ్ నుండి....
on Mar 7, 2018
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం మాంచి ఫామ్ లో ఉన్నాడు. వరుసగా "ఫిదా", " తొలిప్రేమ" సినిమాలు హిట్లు కొట్టడంతో మంచి ఉత్సాహంతో ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాకి రెడీ అయిపోయాడు. అది కూడా 'ఘాజీ' సినిమాతో సూపర్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డితో. సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీ సనిమా తీసి విమర్శల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ఇప్పుడు 'అంతరిక్షం' నేపథ్యంలో ఉన్న కథను ఎంచుకోవడం విశేషం. ఇక ఈ కథ అంతరిక్షం నేపథ్యంలో కొనసాగుతుంది. 'వ్యోమగామి'గా ఈ సినిమాలో వరుణ్ కనిపించనున్నాడు. ఇప్పటికే హిట్స్ తో దూసుకుపోతున్న వరుణ్ తేజ్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ అందులోనూ అంతరిక్షం నేపథ్యం కావడంతో అందరూ ఇంట్రస్టింగ్ తో ఉన్నారు. ఇప్పుడు దానికి తోడు.. మరో న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో యాక్షన్ సన్ని వేశాల కోసం.. హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను ఎంపిక చేసుకున్నారట. వాళ్ల హెల్ప్ తోనే కొన్ని యాక్షన్ సీన్స్ తీయనున్నారట. అంతేకాదు.. జార్జియాలో భారీస్థాయిలో ఒక ప్రత్యేకమైన సెట్ వేసి .. అక్కడ ఈ సీన్స్ ను షూట్ చేయనున్నారట. మరి ఈసినిమాతో వరుణ్ హ్యాట్రిక్ కొడతాడో..? లేదో..? సంకల్ప్ రెడ్డి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడో..?లేదో? తెలియాలంటే సినిమా వచ్చేవరకూ ఆగాల్సిందే.