24న పెళ్లికొడుకవుతున్న బాలీవుడ్ స్టార్!
on Jan 22, 2021
బాలీవుడ్ స్టార్ హీరో, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న వరుణ్ ధావన్ రెండు రోజుల్లో పెళ్లి కొడుకు అవుతున్నాడు. జనవరి 24న ఆయన పెళ్లి ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌తో జరుగుతోంది. దానికి సంబంధించిన సందడి రెండు రోజుల ముందే ఈ రోజే మొదలైంది. చాలా రోజులుగా వరుణ్, నటాషా పెళ్లి వార్తల్లో నలుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. అలీబాగ్‌లోని ఓ స్పెషల్ వేదికపై వారి వివాహం జరగనున్నట్లు సమాచారం.
కొవిడ్-19 నిబంధనలు ఇప్పటికీ అమలులో ఉండటం, కరోనా స్ట్రెయిన్ కేసులు నమోదవుతుండటంతో తక్కువ మంది అతిథులనే ఈ వివాహానికి పిలుస్తున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహిత బంధువులు, మిత్రులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారని తెలుస్తోంది. వారిలో రణబీర్ కపూర్, అలియా భట్ ఉంటారని వరుణ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. గెస్టుల లిస్టులో వరుణ్‌ను 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'తో హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ కరణ్ జోహార్‌తో పాటు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్, జాక్వెలెన్ ఫెర్నాండెజ్, అర్జున్ కపూర్ కూడా ఉండే అవకాశం ఉంది.
స్కూల్లో వరుణ్, నటాషా బెంచ్‌మేట్స్. సిక్స్త్ క్లాస్ నుంచే కలిసి చదువుకున్నామని ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వెల్లడించాడు. చాలా కాలం స్నేహితులుగాను ఉన్న వారు తర్వాత ప్రేమికులుగా మారారు. పదేళ్ల క్రితం న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి వచ్చిన నటాషా సొంత డిజైన్ హౌస్ నటాషా దలాల్ లేబుల్ నడుపుతోంది.
Also Read