ఓ ఇంటివాడైన స్టార్ హీరో!
on Jan 24, 2021
బాలీవుడ్ స్టార్ హీరో, ఇటీవలే 'కూలీ నంబర్ 1' మూవీతో ప్రేక్షకులను అలరించిన వరుణ్ ధావన్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిన్ననాటి నేస్తం నటాషా దలాల్‌ను ఆదివారం రాత్రి వివాహం చేసుకున్నాడు. ముంబై సమీపంలోని అలీబాగ్‌లో వారి వివాహ వేడుక సందడిగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫస్ట్ పిక్చర్స్‌ను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నాడు వరుణ్. ఆ పోస్ట్‌కు "Life long love just became official" అంటూ క్యాప్షన్ జోడించాడు.
ఆ ఫొటోల్లో వరుణ్, నటాషా ఇద్దరూ సిల్వర్ కలర్ పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతుండగా, చుట్టూ వారి కుటుంబ సభ్యులు సందడి చేస్తున్నారు. వరుణ్ తల్లిదండ్రులు డేవిడ్ ధావన్, లాలి కూడా ఓ ఫొటోలో కనిపిస్తున్నారు. వివాహ వేడుక పూర్తయ్యాక వధూవరులిద్దరూ మీడియా కోసం కెమెరా ముందు మరికొన్ని పోజులిచ్చారు.
స్కూల్లో వరుణ్, నటాషా బెంచ్‌మేట్స్. సిక్స్త్ క్లాస్ నుంచే కలిసి చదువుకున్నామని ఓ ఇంటర్వ్యూలో వరుణ్ వెల్లడించాడు. చాలా కాలం స్నేహితులుగాను ఉన్న వారు తర్వాత ప్రేమికులుగా మారారు. పదేళ్ల క్రితం న్యూయార్క్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి వచ్చిన నటాషా సొంత డిజైన్ హౌస్ నటాషా దలాల్ లేబుల్ నడుపుతోంది.