సంక్రాంతికి తొలిసారి రీమేక్‌తో వస్తున్న దిల్ రాజు
on Jun 30, 2020
నిర్మాత దిల్ రాజుకి సంక్రాంతి సీజన్‌తో మంచి అనుబంధమే ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు సినిమాలతో సందడి చేసిన ఈ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్.. ఆయా చిత్రాలతో మంచి విజయాలే అందుకున్నారు. ఈ నేపథ్యంలో.. దిల్ రాజు డబుల్ హ్యాట్రిక్‌కి సిద్ధమవుతున్నారని టాక్. వచ్చే ఏడాది సంక్రాంతికి రానున్న ఆ చిత్రమే.. ‘వకీల్ సాబ్’. అయితే దిల్ రాజు గత సంక్రాంతి చిత్రాలన్నీ ఒక బాటలో వెళ్తే.. ‘వకీల్ సాబ్’ మాత్రం మరో బాటలో వెళ్తోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. దిల్ రాజు నుంచి వచ్చిన సంక్రాంతి చిత్రాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013), ‘ఎవడు’ (2014), ‘శతమానంభవతి’ (2017), ‘ఎఫ్ 2 – ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ (2019), ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) (భాగస్వామ్యంలో నిర్మించిన చిత్రం)ని పరిశీలిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. ఇవన్నీ కూడా స్ట్రెయిట్ సబ్జెక్టులతోనే రూపొందాయి. అయితే 2021 సంక్రాంతికి రాబోతున్న ‘వకీల్ సాబ్’ మాత్రం ఓ రీమేక్ మూవీ. హిందీలో ఘనవిజయం సాధించిన ‘పింక్’ (2016) ఆధారంగా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పు చేర్పులతో రూపొందుతోందీ సినిమా. మరి.. ఇప్పటి వరకు స్ట్రెయిట్ సినిమాలతోనే సంక్రాంతి సీజన్లో విజయాలు అందుకున్న రాజు.. ఈసారి రీమేక్‌తోనూ ఆ విజయపరంపరను కొనసాగిస్తాడేమో చూడాలి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ‘వకీల్ సాబ్’ని ‘ఓ మై ఫ్రెండ్’, ‘ఎం.సి.ఎ’ చిత్రాల దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్నాడు. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి యువ సంగీత సంచలనం తమన్ బాణీలు సమకూరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ మూవీ కావడంతో ‘వకీల్ సాబ్’పై మంచి అంచనాలే ఉన్నాయి.
Also Read