`వకీల్ సాబ్`.. పవన్ రోల్ ఎంతసేపంటే
on Apr 6, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రి-ఎంట్రీ మూవీ `వకీల్ సాబ్` మరో నాలుగు రోజుల్లో సిల్వర్ స్క్రీన్ పైకి రానుంది. మూడేళ్ళకి పైగా విరామం అనంతరం పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. మెగాభిమానుల్లో `వకీల్ సాబ్`పై భారీ అంచనాలే ఉన్నాయి. పాటలు, ప్రచార చిత్రాలు ఆకర్షణీయంగా ఉండడంతో.. సగటు ప్రేక్షకులతో పాటు పరిశ్రమ వర్గాలు, ట్రేడ్ వర్గాలు కూడా ఈ కోర్ట్ డ్రామాపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు.
కాగా, `వకీల్ సాబ్`లో పవన్ రోల్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. రెండున్నర గంటల పాటు సాగే ఈ చిత్రంలో పవర్ స్టార్ కేవలం 50 నిమిషాలే దర్శనమిస్తారట. అయితే కనిపించిన ప్రతి ఫ్రేమ్ లోనూ అభిమానులకు కనువిందు ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. మరి.. పవన్ రి-ఎంట్రీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్` ఆధారంగా రూపొందిన `వకీల్ సాబ్`లో నివేదా థామస్, అంజలి, అనన్య ముఖ్య పాత్రల్లో నటించగా.. శ్రుతి హాసన్ అతిథి పాత్రలో మెరిసింది. యువ సంగీత సంచలనం తమన్ బాణీలు అందించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు.