ఆహా... యువి అడల్ట్ కామెడీ!
on Jul 16, 2020
ప్రభాస్ కజిన్ ప్రమోద్, వంశీ స్థాపించిన యువి క్రియేషన్స్ సంస్థకు మంచి సినిమాలు తీస్తారని పేరుంది. 'మిర్చి' మొదలుకుని 'సాహో' వరకూ కుటుంబంతో కలిసి చూసేవి తీశారు. కెరీర్ స్టార్టింగ్లో బోల్డ్ కాన్సెప్ట్స్, డైలాగులతో సినిమాలు తీసిన మారుతితో 'మహానుభావుడు', 'భలే భలే మగాడివోయ్' వంటి క్లీన్ ఎంటర్టైనర్స్ తీశారు. అయితే, వెబ్ కంటెంట్ కోసం యువి కూడా అడల్ట్ కంటెంట్ వైపు అడుగులు వేస్తోంది.
ప్యూర్ తెలుగు డిజిటల్ ఫ్లాట్ఫార్మ్ ఆహా కోసం యువి క్రియేషన్స్ ఒక అడల్ట్ కామెడీ ప్రొడ్యూస్ చేస్తోంది. కానీ, తమ బ్యానర్ పేరు మాత్రం వేసుకోదని టాక్. తమ సంస్థలో 'ఎక్స్ప్రెస్ రాజా' తీసిన మేర్లపాక గాంధీ అందించిన కథతో, అతడి శిష్యుడు ఒకరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో సంతోష్ శోభన్ (దివంగత దర్శకుడు శోభన్ తనయుడు), బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోలు. షూటింగ్ చేయడానికి విశాఖలో బీచ్ సైడ్ రిసార్ట్ బుక్ చేశారట. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి, విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.