అరవింద సమేత సెకండ్ టీజర్.. అదేనా రీజన్
on Aug 20, 2018
ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఆ అంచనాలను నిజం చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలైన అరవింద సమేత టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అయితే చిత్ర యూనిట్ రెండో టీజర్ కూడా త్వరలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తుందట.
మొదటి టీజర్ మంచి యాక్షన్ ఎలిమెంట్స్ అండ్ పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ కిక్ ఇచ్చింది కాని.. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ లేకపోవడంతో త్రివిక్రమ్ ఫ్యాన్స్ కాస్త నిరాశచెందారని చిత్ర యూనిట్ భావిస్తోందట.. అందుకే త్రివిక్రమ్ ఫ్యాన్స్ కోసం రెండో టీజర్ విడుదల చేయాలనుకుంటున్నారట.. దీనిలో లవ్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉంటాయట.. ఈ టీజర్ ని ఈ నెల చివరిలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. దీన్నిబట్టి చూస్తుంటే అరవింద సమేత అన్ని ఎలిమెంట్స్ కలగలిసిన ఫుల్ మీల్స్ లాంటి సినిమా అనిపిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.