త్రివిక్రమ్‌కి మరో ఫ్లాప్ తగిలినట్టే!
on Apr 6, 2018
పాపం త్రివిక్రమ్ టైం ఏమీ బాగాలేదు. అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో ఒక్కసారిగా డౌన్లోకి వెళ్లిపోయాడు త్రివిక్రమ్. ఈసినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడమే కాదు, త్రివిక్రమ్ క్రేజ్‌ని ఆకాశం లోంచి పాతాళానికి తీసుకొచ్చేసింది. ఈ సినిమా తరవాత త్రివిక్రమ్ పబ్లిక్ ఫంక్షన్లకు రావడానికి కూడా భయపడుతున్నాడంటే ఈ ఫ్లాప్ ఎఫెక్ట్ ఎలాంటిదో ఊహించుకోవొచ్చు. ఐపీఎల్ కోసం ఎన్టీఆర్‌తో ఓ యాడ్ డిజైన్ చేశాడు త్రివిక్రమ్. అందులో ఎన్టీఆర్ చెప్పిన డైలాగుల నిండా ప్రాసలే. టీవీ యాడ్‌లో కూడా ఈ ప్రాసల గోలేంట్రా బాబూ.. అనుకుంటున్నారు జనాలు. ఆ విధంగా ఎన్టీఆర్‌కీ ఓ ఫ్లాప్ ఇచ్చేశాడు త్రివిక్రమ్. ఇప్పుడు మరో ఫ్లాప్ తగిలింది. అదెలాగంటారా?? నితిన్ కథానాయకుడిగా నటించిన ఛల్ మోహన రంగకి త్రివిక్రమ్ నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి కథ కూడా అందించాడు త్రివిక్రమ్. ఆయనగారి కథంటే ఏదో మ్యాజిక్ ఉందని థియేటర్లకు వెళ్తారు జనాలు. కానీ... చాలా నాశిరకమైన కథని అందించాడు త్రివిక్రమ్. చాలా సినిమాల్లో చూసిన రొటీన్ కథని.. నితిన్‌కి అంటగట్టాడు. అంతంతమాత్రంగా ఉన్న ఈ కథని లాక్కుని రావడానికి నాని, కృష్ణ చైతన్య చాలా కష్టపడాల్సి వచ్చింది. అలా ఓ కథకుడిగా ఈ సినిమాతో ఓ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు త్రివిక్రమ్.