త్రివిక్రమ్ పేరుతో యాప్...
on Nov 6, 2016
ఇప్పటి వరకూ అనేక యాప్స్ చూశాం. ఇప్పుడు కొత్తగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ సరికొత్త యాప్ ను తీసుకొస్తున్నారు అభిమానులు. రేపు అంటే నవంబర్ 7 వ తేదీ త్రివిక్రమ్ బర్త్ డే ఉన్నందున అభిమానులు అనేక ప్లాన్లు చేస్తున్నారు. దీనిలోభాగంగానే.. ఎ.బి.సి. డిజిటల్ మీడియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటిసారి ఓ గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఓ ఆండ్రాయిడ్ యాప్ ను, వెబ్ సైట్ ను (WWW.TRIVIKRAMCELLULOID.IN) ఈ సంస్థ ప్రారంభిస్తోంది. ఈ యాప్ ను త్రివిక్రమ్ కు పుట్టినరోజు సందర్బంగా అందించనున్నారు. ఈ యాప్ ద్వారా అభిమానులంతా ఒకే ఒక్క క్లిక్ తో త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించిన అన్ని రకాల తాజా విశేషాలను తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను నవంబర్ 7 నుంచి ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మరి ఒక దర్శకుడి పేరుతో మొట్టమొదటిసారిగా యాప్ రావడం గొప్ప విషయమే కదా.