బన్నీ, ఎన్టీఆర్ ల గురించి రంభ ఏం చెప్పింది?
on Oct 31, 2016
టాలీవుడ్ లో స్టార్ డాన్సర్లకు కొదవలేదు. అందులో ఒకరు బెస్ట్ అంటే.. సమాధానం చెప్పలేం. అయితే డాన్స్ విషయంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లు మాత్రం పోటాపోటీగా దూసుకుపోతున్నారు. వీళ్లిద్దరితో ఐటెమ్ సాంగులు చేసింది ఒకప్పటి గ్లామర్ సోయగం రంభ. అల్లు అర్జున్ గురించీ, ఎన్టీఆర్ గురించి రంభ ఏమంటోంది? వీళ్లిద్దరిలో బెస్ట్ ఎవరు?? వీటిపై రంభ స్పందించింది. అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచీ తెలుసని, డాన్సులు బాగా చేస్తాడని, అయితే... ఇంకా తనలో చిన్న పిల్లల లక్షణం పోలేదని, సెట్లో చాలా అల్లరి చేస్తాడని చెప్పుకొచ్చింది రంభ. ఎన్టీఆర్‌కీ చాలా కాంప్లిమెంట్లు ఇచ్చేసింది. ఎన్టీఆర్ చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తాడని, ఎలాంటి పాత్రల్లో అయినా రాణిస్తాడని, సెట్లో చాలా మర్యాదగా నడుచుకొంటాడని, నాచోరే నాచోరే పాట చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ కాలికి గాయమైనా, ఆ బాధని దాచుకొని మరీ అద్భుతంగా డాన్స్ చేశాడని కితాబులు ఇచ్చింది. దేశముదురులో బన్నీతోనూ, యమదొంగలో తారక్‌తోనూ రంభ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. రంభ కామెంట్లతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారిప్పుడు.