హీరోగా వస్తున్న మరో కమెడియన్
on Jul 1, 2020
హీరోలుగా సక్సెస్‌లు అందుకున్న కమెడియన్స్ తెలుగులో ఉన్నారు. అయితే, హీరోలుగా సక్సెస్ఫుల్ కెరీర్ కంటిన్యూ చేసిన కమెడియన్స్ మాత్రం తక్కువే. ‘యమలీల’ వంటి సక్సెస్ఫుల్ ఫిలిమ్ చేసిన అలీ, ఆ తర్వాత కామెడీ వేషాలు వేయక తప్పలేదు. రాజమౌళి దర్శకత్వంలో ‘మర్యాద రామన్న’, ఆ తర్వాత కొన్ని హిట్ ఫిలిమ్స్ చేసిన సునీల్, మళ్లీ కామెడీ వేషాల బాట పట్టాడు. కమెడియన్ శ్రీనివాసరెడ్డి తనకు నప్పే కథలు వచ్చినప్పుడే హీరోగా చేస్తున్నారు. మరి, నవీన్ నేని ఈ లిస్ట్‌లో చేరతాడో, హీరోగా సక్సెస్ఫుల్ కెరీర్ కంటిన్యూ చేస్తాడో?
'కుమారి 21ఎఫ్', 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల్లో ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించిన నవీన్ నేని గుర్తున్నాడా? తాజాగా విడుదలైన 'అల్లరి' నరేష్ కొత్త సినిమా 'బంగారు బుల్లోడు' టీజర్ లోనూ కనిపిస్తాడు. మంగళవారం అతని పుట్టిన రోజు. ఈ సందర్భంగా కెఎస్ ఫిలిం వర్క్స్ ప్రొడక్షన్ హౌస్ నవీన్ హీరోగా సినిమా తీస్తున్నట్లు ప్రకటించింది అంతకుమించి వివరాలు ఏమీ చెప్పలేదు. ఈ సినిమాతో కె.ఎస్ హేమరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి సత్యన్ మ్యూజిక్ అందించనున్నాడు.