తగ్గేదేలే.. రికార్డు ధరకు రామ్ 'వారియర్' హిందీ రైట్స్!
on Jan 25, 2022
కోలీవుడ్ డైరెక్టర్ ఎన్ లింగుసామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం 'ది వారియర్'. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశారు. ఇక తాజాగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోవడం హాట్ టాపిక్ గా మారింది.
బాహుబలి తర్వాత హిందీ ప్రేక్షకులు టాలీవుడ్ సినిమాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక ఇటీవల అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప ది రైజ్' హిందీలో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు సినిమాల హిందీ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. దానికి తోడు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ మాస్ కి బాగా దగ్గరయ్యాడు. అలాగే రామ్ హిందీ డబ్బింగ్ సినిమాలకు యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని, పక్క కమర్షియల్ మూవీగా రూపొందుతోన్న 'ది వారియర్' హిందీ డబ్బింగ్ రైట్స్ 16 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కేవలం ఫస్ట్ లుక్ తోనే 'ది వారియర్' సినిమాకి ఈ స్థాయి రెస్పాన్స్ రావడం విశేషం.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న 'ది వారియర్' సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా, కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.