దమ్ముంటే దేవిశ్రీ పై రాయండంటూ తమన్ సవాల్!!
on Oct 13, 2018
తమన్ మ్యూజిక్ చేసిన ఏ సినిమా ఆడియో విడుదలైన అందులోని పాటలు కాపీ అంటూ ఒరిజినల్ సాంగ్స్ పెట్టి మరీ తమన్ ట్రోల్ చేయడం తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన `అరవింద సమేత` సినిమా విషయంలో కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు తమన్. శ్రోతలతో పాటు క్రిటిక్స్ కూడా తమన్ పాటలు గురించి రివ్యూస్ రాశారు. అయితే ఆ రివ్యూస్ అన్ని కూడా తమన్ ని చాలా బాధ పెట్టాయట. `అరవింద సమేత` చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా ఈ రోజు తమన్ మీడియాతో మాట్లాడుతూ...``ప్రతి ఒక్క మ్యూజిక్ డైరక్టర్ కి ఒక స్టైల్ ఉంటుంది. అలా నా కో శైలి ఉంది. నేను చేసే పాటలు అక్కడ అక్కడ కలుస్తుంటాయి. అదెలా కాపీ కొట్టడం అవుతుందో నా కర్ధం కావట్లేదు. ఇలా ఎందుకు రాస్తున్నారో....నేను సైలెంట్ గా ఉంటున్నాను కాబట్టి ఇలా రాస్తున్నారు. ఎప్పుడో కచ్చితంగా బరస్ట్ అవుతానంటూ క్రిటిక్స్ పై కొంత అసహనం వ్యక్తం చేశారు. అయినా నేనే కాపీ కొడుతున్నానా? రహమాన్, దేవిశ్రీప్రసాద ల గురించి దమ్ముంటే నా మీద రాసినట్టు రాయండి అంటూ ఘాటుగా స్పందించారు. వాళ్ల మీద రాయడం చేత కాదు కానీ నా మీద మాత్రం తెగ రాసేస్తున్నారు. కచ్చితంగా ఏదో ఒక రోజు బరస్ట్ అవుతానన్నారు.
మీ మీద వచ్చే విమర్శలు ఎలా తీసుకుంటారు అని అడగ్గా....నేను అసలు కేర్ చేయను. పట్టించుకోను. అయినా గతంలో దర్శక నిర్మాతల కోరిక మేరకు కొన్ని పాటలు మిగతా భాషల నుంచి తీసుకోని చేయడం జరిగింది. అది పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పారు కూడా. ఒక సినిమా కు నాలుగు పాటలు చేసినవాడిని ఐదో పాట చేయలేనా? కాపీ కర్మ ఏంటి? అది కేవలం ఆ దర్శక నిర్మాతల కోరిక మేరకు మాత్రమే చేయడం జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అరవింద సమేత గురించి మాట్లాడుతూ...ఈ సినిమాకు వర్క్ చేయడం చాలా హ్యాపీ. కథతో పాటు సాగే పాటలు చేశాను. నేపథ్య సంగీతానికి కూడా చాలా మంచి పేరొచ్చింది. త్రివిక్రమ్ గారితో ఫస్ట్ టైమ్ వర్క్ చేయడం చాలా సంతృప్తినిచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత నాకు త్రివిక్రమ్ గారితో వర్క్ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం అఖిల్ సినిమాకు, అమర్ అక్బర్ ఆంథోని సినిమాలకు మ్యూజిక్ చేస్తున్నా`` అన్నారు.