తెలుగువన్ షార్ట్ ఫిల్మ్ విజేతకు పదివేల బహుమతి
on Oct 1, 2014
ఇప్పుడు షార్ట్ ఫిలిం యుగం నడుస్తోంది. షార్ట్ ఫిలిమ్స్ రూపకర్తలు మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకులుగా ఎదుగుతున్నారు. దర్శకులు కావాలని కృషి చేస్తున్న ఎంతోమంది ప్రతిభకు కొలమానంగా షార్ట్ ఫిలిమ్స్ నిలుస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన తెలుగువన్ షార్ట్ ఫిలిం దర్శకులను ప్రోత్సహిస్తోంది. తెలుగువన్ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకున్న అనేకమంది యువతీయువకులు అద్భుతమైన షార్ట్ ఫిలిమ్స్ని రూపొందించి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. తెలుగువన్ అందించిన షార్ట్ ఫిలిం అవకాశం మెట్టు ఎక్కిన చాలామంది తమ ప్రతిభతో మరిన్ని మెట్లు ఎక్కి సినిమా రంగానికి చేరువయ్యారు కూడా. షార్ట్ ఫిలిం దర్శకులను ప్రోత్సహించడంలో భాగంగా తెలుగువన్ నెలనెలా ఉత్తమ షార్ట్ ఫిలిం దర్శకుడికి పదివేల రూపాయల నగదు బహుమతి అందిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 16 జూలై నుంచి 15 ఆగస్ట్ వరకు తెలుగువన్ ప్రోత్సాహంతో రూపొందించిన షార్ట్ ఫిలిమ్స్ లో సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘Bandhan’ షార్ట్ ఫిలిం ఉత్తమ షార్ట్ ఫిలింగా ఎంపికయింది. ఈ షార్ట్ ఫిలిం రూపొందించిన ఉత్తమ దర్శకుడు 'సందీప్ రాజ్' ఆస్ట్రేలియాలో వుండడంతో ఆయన తండ్రి గారికి తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ రవిశంకర్ కంఠమనేని పదివేల రూపాయల చెక్ని అందించారు. షార్ట్ ఫిలిం రూపకర్తలకు తెలుగువన్ అందిస్తున్న అవకాశాన్ని అందిపుచ్చుకుని మరిన్ని ఉత్తమ షార్ట్ ఫిలింలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.