దుమ్ములేపుతున్న 7.30 షార్ట్‌ఫిల్మ్
on Jan 5, 2017
జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీం పేరు తలుచుకోగానే అందరికి గుర్తొచ్చేది ఫస్ట్ గెటప్ శ్రీనునే.. వెరైటీ గెటప్స్‌తో తెలుగు వారిని కడుపుబ్బా నవ్విస్తున్నాడు గెటప్ శ్రీను. జబర్దస్త్ ఒక్కటే కాకుండా మూడు, నాలుగు షోలు, కల్చరల్ ప్రోగ్రామ్స్, సినిమాలతో మనోడు యమ బిజీ. రీసెంట్గా మనోడు 7.30 AM అనే షార్ట్ ఫిల్మ్‌లోనూ యాక్ట్ చేశాడు. తెలుగువన్ సహకారంతో.. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్‌ఫిల్మ్‌లో ఎప్పుడూ నవ్విస్తుండే శ్రీను..తొలిసారి భయపెట్టాడు..తాను కామెడీ మాత్రమే కాదని సీరియస్ రోల్ అయినా చేయగలనని నిరూపించాడు. అన్నట్లు ఈ షార్ట్‌ఫిల్మ్ యూట్యూబ్‌లో రిలీజైన ఒక్క రోజులోనే 2 లక్షల వ్యూస్ సాధించింది.
;