పాత టైటిల్స్ తో హిట్లెక్కువా? ఫట్లెక్కువా?
on Feb 20, 2018
పాత హిట్ సినిమాల టైటిల్స్ తో సినిమాలు రావడం చిత్ర పరిశ్రమలో కామన్. అయితే... వాటి ఫలితాలెలా ఉన్నాయ్? హిట్లు ఎక్కవా? ఫట్లెక్కువా? అనే విషయాన్ని సరదాగా కాసేపు ముచ్చటించుకుందాం..
ముందు పాత టైటిల్స్ తో చిరంజీవి చేసిన సినిమాల విషయానికొస్తే...
‘ఎన్టీయార్ ‘దేవాంతకుడు’ చాలా పెద్ద హిట్. తొలి సోషియో ఫాంటసీ సినిమాగా పేరు గడించిన సినిమా అది. ఆ సినిమా ప్రేరణతోనే తర్వాత యమగోల, యముడికి మొగుడు, యమలీల, యమదొంగ.. ఇవన్నీ వచ్చాయ్. అదే సినిమా టైటిల్ తో చిరంజీవి చేసిన ‘దేవాంతకుడు’... డిజాస్టర్.
ఎన్టీయార్ ‘ఇంటిగుట్టు’ సూపర్ హిట్. అదే టైటిల్ తో చిరంజీవి చేసిన ‘ఇంటిగుట్టు’ హిట్.
చిరంజీవి ‘ఆరాధన’కు ముందు అదే టైటిల్ తో ఎన్టీయార్, ఏఎన్నార్లు సినిమాలు చేశారు. అక్కినేని ‘ఆరాధన’ బ్లాక్ బస్టర్. ఎన్టీయార్ ’ఆరాధన’ సూపర్ హిట్. కానీ.. చిరంజీవి ‘ఆరాధన’ అట్టర్ ఫ్లాప్
శోభన్ బాబు ‘జేబుదొంగ’ సూపర్ హిట్ కాగా.. చిరంజీవి ‘జేబు దొంగ’ డిజాస్టర్.
శోభన్ బాబు ‘ముగ్గురు మొనగాళ్లు’ యావరేజ్. చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ ఫ్లాప్.
అర్జున్ ‘జెంటిల్మేన్’ సూపర్ హిట్. చిరంజీవి ‘ది జెంటిల్మెన్’ అట్టర్ ఫ్లాప్.
అక్కినేని ‘ఇద్దరు మిత్రులు’ బ్లాక్ బస్టర్.. చిరంజీవి ‘ఇద్దరు మిత్రులు’ అట్టర్ ఫ్లాప్.
దీన్ని బట్టి... మెగాస్టార్ కి పాత టైటిల్స్ పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. ఇక బాలయ్య విషయానికొస్తే...
ఎన్టీయార్ ‘కథానాయకుడు’ సూపర్ హిట్. బాలయ్య ‘కథానాయకుడు’ కూడా మంచి హిట్టే.
ఎన్టీయార్ ‘భలే తమ్ముడు’ రికార్డులు తిరగరాస్తే... బాలయ్య ‘భలే తమ్ముడు’ యావరేజ్.
ఎన్టీయార్ ‘నిప్పులాంటి మనిషి’ ఓ చరిత్ర. బాలయ్య నిప్పులాంటి మనిషి ‘డిజాస్టర్’.
ఎన్టీయార్ ‘సీతారామకల్యాణం’ ఓ క్లాసిక్ బాలయ్య ‘సీతారామ కల్యాణం’... మంచి హిట్.
ఎన్టీయార్ ‘రాము’ పెద్ద హిట్. బాలయ్య ‘రాము’ యావరేజ్.
ఎన్టీయార్ ‘జయసింహ’... బాక్సాపీస్ రికార్డులను తిరగరాస్తే... బాలయ్య ‘జై సింహ’ హిట్ అనిపించుకుంది.
అక్కినేని సినిమా టైటిల్స్ ని కూడా బాలయ్య వదల్లేదండోయ్. ’ఆత్మబలం’ పేరుతో బాలయ్య ఓ సినిమా చేశాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. అంతేకాదు... అక్కినేని క్లాసిక్ ‘దొంగరాముడు’ పేరుతో కూడా బాలయ్య ఓ సినిమా చేశాడు.ఆ సినిమా కూడా డిజాస్టరే.
ఇక పాత సినిమా టైటిల్స్ తో నాగార్జున చేసిన సినిమాల గురించి చెప్పుకుందాం.
నాగ్ ‘నిన్నే పెళ్లాడతా’ టైటిల్ తో గతంలో ఓ సినిమా వచ్చింది. దాంట్లో హీరో ఎన్టీయార్. అయితే.. ఎన్టీయార్ ‘నిన్నేపెళ్లాడతా’ పెద్ద ఫ్లాప్. నాగ్ ‘నిన్నే పెళ్లాడతా’ బ్లాక్ బాస్టర్.
ఎన్టీయార్ ‘ఎదురులేని మనిషి’ బ్లాక్ బాస్టర్ కాగా, నాగ్ ‘ఎదురులేని మనిషి’ డిజాస్టర్.
ఎన్టీయార్ ‘సంతోషం’ ఫ్లాప్ సినిమా కాగా, నాగ్ ‘సంతోషం’ సూపర్ హిట్.
దాసరి ‘గ్రీకువీరుడు’ అట్టర్ ఫ్లాప్... నాగ్ ‘గ్రీకువీరుడు’ కూడా అట్టర్ ఫ్లాప్.
ఓంకార్ ‘రాజుగారి గది’ మంచి హిట్. అతనే నాగ్ తో చేసిన ‘రాజుగారి గది’ అట్టర్ ఫ్లాప్.
ఇక మన వెంకీ విషయానికొస్తే...
అక్కినేని ‘ప్రేమ’ యావరేజ్ కాగా, వెంకటేశ్ ‘ప్రేమ’ సూపర్ హిట్.
ఎన్టీయార్ ‘అగ్గిరాముడు’ సూపర్ హిట్ కాగా.. వెంకీ ’అగ్గిరాముడు’ డిజాస్టర్
అక్కినేని ‘పవిత్ర బంధం’ సూపర్ హిట్. వెంకీ ‘పవిత్ర బంధం’ సూపర్ హిట్
ఎన్టీయార్ ‘మల్లీశ్వరి’ తెలుగు సినిమా క్లాసిక్స్ లో ఒకటి కాగా, వెంకీ ‘మల్లీశ్వరి’ సూపర్ హిట్ అంతే.
మణిరత్నం’ ఘర్షణ’ మెగా హిట్. వెంకీ ‘ఘర్షణ’.. హిట్
కృష్ణ ‘ఈనాడు’ సూపర్ హిట్ కాగా, వెంకీ ’ ఈనాడు’ అట్టర్ ఫ్లాప్
ఈ నలుగురు కాక, మిగిలిన హీరోలు కూడా చాలామంది పాత టైటిల్స్ వాడేశారు. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం.