మరోసారి ఆ దర్శకుడికి కాజల్ అవకాశం!!
on Jun 18, 2019
విభిన్న దర్శకుడు తేజ, అందాల నటి కాజల్ కలయికలో మరో సినిమా రాబోతుందని సమాచారం అందుతోంది. ఈ మధ్య వీరిద్దరి కలయికలో `సీత` సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు. ఇక మరోసారి కాజల్ కోసం లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ను రెడీ చేస్తున్నాడట తేజ. మరో విశేషమేంటంటే.. ఈ సినిమాని స్వయంగా కాజలే నిర్మించనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాంటెంపరరీ అంశాలతో సందేశంతో పాటు, వినోదాన్ని మేళవించి ఈ సినిమాను రూపొందించనున్నాడు తేజ. ఇక ఈ సినిమా పట్టాలెక్కితే వీరిద్దరి కలయికలో `లక్ష్మి కళ్యాణం, నేనే రాజు నేనే మంత్రి, సీత, తర్వాత వస్తోన్న నాలుగో చిత్రమవుతుంది. కాజల్ ని `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఆడియన్స్ కు కాజల్ ని తేజ పరిచయం చేసిన విషయం తెలిసిందే.