నిన్ను కాపాడమని మహేశ్ సార్‌ని అడుగు!
on Jul 1, 2020
ఒక తమిళ సినిమాని మెచ్చుకుంటూ రాండమ్‌గా తెలుగు సినిమాలపై సెటైర్లు వేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను టాలీవుడ్ స్టార్ల ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, దాంతో ఇద్దరు మహేశ్ అభిమానులపై హైదరాబాద్ పోలీసులకు తరుణ్ భాస్కర్ ఫిర్యాదు చేయడం అవాంఛనీయ పరిణామాలకు దారి తీసేలా కనిపిస్తోంది. ఒకరితో తరుణ్ భాస్కర్ చాట్ చేసిన విషయాలను అతను సోషల్ మీడియా సాక్షిగా వెల్లడి చేయడం, అందులో తరుణ్ వాడిన పదజాలం ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్యర్యపరిచాయి.
"నీ నంబర్ కానీ, మీ నాన్న నంబర్ కానీ ఇవ్వు" అని ఆ చాటింగ్‌లో డిమాండ్ చేసిన తరుణ్, "బ్రదర్ సారీ నిన్ను మేం ట్రాక్ చేస్తాం. నిన్ను కాపాడమని దయచేసి మహేశ్ సార్‌ని అడుగు" అని సలహా ఇచ్చాడు. అలా చెప్పడంలోని వ్యంగ్యం ఎవరికైనా సునాయాసంగా అర్థమైపోతుంది. అవతలి వ్యక్తి, "అయినా హెరాస్మెంట్ చెయ్యలేదు కదా అన్నా" అని అడిగితే, "మీలాంటి నలుగురిని మీడియా ముందు పెట్టి మాట్లాడితే అప్పుడు ఎగ్జాంపుల్ సెట్ అవుతుంది" అని వార్నింగ్ కూడా ఇచ్చాడు తరుణ్. ఈ సంభాషణను అతను హైదరాబాద్ సిటీ పోలీస్‌కు, సైబరాబాద్ పోలీస్‌కు ట్యాగ్ చేశాడు. మరి పోలీసులు తరుణ్ చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా పరిగణనలోకి తీసుకుంటారో చూడాలి.
గమనించదగ్గ అంశమేమంటే, ఈ విషయంలో అందరు హీరోల ఫ్యాన్లు ఏకమై తరుణ్ పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన ఇద్దరు మహేశ్ అభిమానులు అనుదీప్, కృష్ణతేజకు మద్దతుగా సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.