ఫొటో స్టోరీ.. రెడ్ బికినీలో బర్త్‌డే బ్యూటీ!
on Nov 20, 2020
బాలీవుడ్ సుందరి తారా సుతారియా గురువారం ఓ సంవత్సరం పెద్దదయ్యింది. తన 25వ బర్త్‌డేని ఆమె మాల్దీవుల్లో జరుపుకుంది. ఈ సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా ఆమె షేర్ చేసిన పిక్చర్ సోషల్ మీడియాను తుఫానులా చుట్టేసింది. నీలి సముద్రంపై ఎర్ర బికినీలో ఉన్న ఆమె లుక్స్ స్టన్నింగ్‌గా ఉన్నాయని వేరే చెప్పాలా! ఆ పిక్చర్‌కు "Beach/Birthday Baby". అనే క్యాప్షన్ జోడించింది తార. ఆమె ఆ పిక్చర్ షేర్ చేసిన మరుక్షణం నుంచే కామెంట్ సెక్షన్లో ఫ్యాన్స్ ఆమెపై తమ ప్రేమాభిమానాలను ఎక్స్‌ప్రెస్ చేస్తూ వచ్చారు.
మాల్దీవుల్లో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఆడార్ జైన్‌తో కలిసి ఎంజాయ్ చేస్తుండటం గమనార్హం. అంతకు ముందు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' మూవీలో ఆమె హీరో టైగర్ ష్రాఫ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ, "Happy bday T. Hope you have a smashing year ahead! Cya at work soon." అని రాసుకొచ్చాడు. దానికి ఆమె, "Thank you fav Cub!!! Cannot waiittt" అని రిప్లై ఇచ్చి రెండు హార్ట్ ఎమోజీలను జోడించింది.
ప్రస్తుతం ఆమె టాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ 'ఆర్ఎక్స్' 100 హిందీ రీమేక్‌లో పాయల్ రాజ్‌పుత్ క్యారెక్టర్ పోషిస్తోంది. హీరోగా సునీల్ శెట్టి కుమారుడు అహన్ శెట్టి నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు 'ఏక్ విలన్ 2'లో జాన్ అబ్రహాం, అర్జున్ కపూర్, దిశా పటానీలతో కలిసి నటిస్తోంది తార.
Also Read