English | Telugu

తారా చౌదరిపై క్లారిటీ ఇచ్చిన రాజశేఖర్..

on Nov 12, 2017

చాలా ఏళ్ల తరువాత సక్సెస్ అందుకున్న యాంగ్రీ యంగ్‌మన్‌ రాజశేఖర్‌ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. దీంతో ఎక్కడ ఏ ఇంటర్వ్యూలు దొరికినా అక్కడ తెగ ఇంటర్వ్యూలు ఇచ్సేస్తున్నాడు. ఇక ఈ ఇంటర్య్వూల్లో కూడా రాజశేఖర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్ తాజాగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే హాట్ టాపిక్ అయ్యాయి. అదేంటంటే..తారా చౌదరితో రాజశేఖర్‌కు ఉన్న సంబంధం గురించి. గతంలో తారా చౌదరితో రాజశేఖర్‌కు సంబంధాలు ఉన్నాయన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ వార్తలపై స్పందించిన రాజశేఖర్... నేనేమి శ్రీరామ చంద్రుడిని కాదు, పెళ్లి కాక ముందు ఒక్కరు ఇద్దరితో వ్యవహారం నడిచింది. అయితే తారా చౌదరితో సంబంధం మాత్రం ఎప్పుడు లేదు. ఆమెను ఒకటి రెండు సందర్బాల్లో ఏదో విషయమై కలిశాను తప్ప అంతకు మించి మరేం లేదు. తారా చౌదరి తాను కలిసిన ఫొటోలను పట్టుకుని తనపై అసత్య ప్రచారం చేసిందని రాజశేఖర్‌ చెప్పుకొచ్చాడు. తాను తారా చౌదరి వ్యవహారంలో ఇరుకున్న సమయంలో చాలా మనోవేదనకు గురి అయ్యాను అంటూ రాజశేఖర్‌ పేర్కొన్నాడు. తనకు సంబంధం లేకున్నా కూడా తన పరువును తీస్తున్న వ్యక్తుల మీద తెగ కోపం వచ్చింది. కాని సరైన సమయం కోసం ఎదురు చూశాను. ఆ సమయం ఇప్పుడు వచ్చిందని అన్నాడు.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here