ఒక్క సినిమాకు 100 కోట్లు అడిగాడట!
on Jan 13, 2020
అక్షరాలా వంద కోట్ల రూపాయలు... రూ.100కోట్లు. ఒక్క సినిమా... ఒకే ఒక్క సినిమా చేయడానికి తమిళ స్టార్ హీరో విజయ్ వంద కోట్ల రూపాయలు పారితోషికంగా అడిగాడట. ఒక తమిళ సినిమా చేయాలని ముంబై నిర్మాత ఒకరు ఈ హీరోను సంప్రదించగా... రెమ్యూనరేషన్ గా 100 కోట్లు, అదీ వైట్ మనీలో డిమాండ్ చేయడంతో షాక్ తిన్నాడట. వంద కోట్లకు జీఎస్టీ 18 కోట్ల రూపాయలను కూడా నిర్మాత కట్టాలని చెప్పాడట. అంటే... మొత్తం రెమ్యూనరేషన్ రూ. 118 కోట్లు అవుతుందన్నమాట.
తమిళ సినిమా మార్కెట్ ఎంత? విజయ్ మార్కెట్ ఎంత? అంత డిమాండ్ చేయడానికి? అని ప్రశ్నిస్తే... విజయ్ కోటరీ నుండి అతడికి మద్దతుగా సమాధానాలు వస్తున్నాయి. విజయ్ సినిమాలు ఈజీగా వంద కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. అతడి లాస్ట్ సినిమా 'బిగిల్'కు థియేటర్ కలెక్షన్స్ 150 కోట్లు వచ్చాయని చెప్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఇంకొన్ని కోట్లు వచ్చి ఉండొచ్చు. ఆడియో, డిజిటల్, శాటిలైట్ వగైరా వగైరా కలుపుకుంటే 300 కోట్లు చేరుతుందట. అందుకని, హీరో 100 కోట్లు డిమాండ్ చేయడంలో తప్పు లేదంటున్నారు. ఇప్పటివరకు హిందీలో కూడా ఏ హీరో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోలేదు. సల్మాన్, ఆమిర్, షారుఖ్ వంటి హీరోలు లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. విజయ్ అడిగినంత హిందీ నిర్మాత ఇస్తే ఇండియాలో 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి హీరో అతడే అవుతాడు.