'ఎఫ్2' సీక్వెల్లో తమన్నా, మెహరీన్ స్పెషల్ సాంగ్!
on Apr 7, 2020
డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఓ సెంటిమెంట్ వుంది. అతడి లేటెస్ట్ సినిమాలో, అంతకు ముందు అతడు డైరెక్ట్ చేసిన సినిమాలో హీరోయిన్ చేత స్పెషల్ సాంగ్లో స్టెప్పులు వేయిస్తారు. 'సుప్రీమ్'లో 'పటాస్' హీరోయిన్ శృతి సోధి స్పెషల్ సాంగ్ చేశారు. 'రాజా ది గ్రేట్'లో 'సుప్రీమ్' హీరోయిన్ రాశీ ఖన్నా ఒక పాటలో తళుక్కున మెరిశారు. ఆ సినిమాలో హీరోయిన్ మెహరీన్ 'ఎఫ్2'లోనూ నటించారు. 'సరిలేరు నీకెవ్వరు'లో 'ఎఫ్2'లో ఒక హీరోయిన్ తమన్నా స్పెషల్ సాంగ్ చేశారు. ప్రజెంట్ అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సీక్వెల్ 'ఎఫ్ 3' స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. అందులో 'సరిలేరు నీకెవ్వరు' హీరోయిన్ రష్మిక స్పెషల్ సాంగ్ చేస్తారో లేదో తెలియదు. కానీ, 'ఎఫ్2'లో నటించిన తమన్నా, మెహరీన్ స్పెషల్ సాంగ్లో సందడి చేస్తారని సమాచారం.
'ఎఫ్2 'లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. సీక్వెల్లో వాళ్లిద్దరి క్యారెక్టర్లు కొనసాగుతాయి. అయితే హీరోయిన్లుగా 'ఎఫ్ 2'లో నటించిన తమన్నా, మెహరీన్ కాకుండా కొత్తవాళ్ళను తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట. అందుకని, వాళ్ళిద్దరితో అనిల్ రావిపూడి ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్. లాక్ డౌన్ విధించడానికి ముందు స్టోరీ సిట్టింగ్స్ కోసం డైరెక్టర్ టీమ్ విశాఖ వెళ్ళింది. ప్రజెంట్ అక్కడే ఉండి, మిగతా విషయాలు పట్టించుకోకుండా స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారట.
Also Read