మహేష్ ఇంట్రడక్షన్... తమన్నా స్పెషల్ అట్రాక్షన్!
on Sep 9, 2019
మహేష్ బాబుతో కలిసి మరోసారి కాలు కదపడానికి తమన్నా రెడీ అవుతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన 'ఆగడు' ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఇద్దరూ మరో సినిమాలో జంటగా నటించలేదు. ఈసారి కూడా జంటగా నటించడం లేదు. కానీ, ఓ పాటలో ఇద్దరూ కనిపిస్తారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరూ'. ఇందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో తమన్నా స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నారు. ఇంతకు ముందు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉండేవి. తరవాత వాటిని స్పెషల్ సాంగ్స్ అంటూ పిలవడం ప్రారంభించారు. ఇది అలాంటి స్పెషల్ సాంగ్. 'దూకుడు'లో మహేష్ ఇంట్రడక్షన్ సాంగ్ లో మీనాక్షి దీక్షిత్ సందడి చేశారు. 'సరిలేరు నీకెవ్వరూ'లో అదే విధంగా తమన్నా సందడి చేయనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక. విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
