ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో టబు
on Apr 5, 2021
`కొత్త కొత్తగా ఉన్నది` అంటూ మెలోడీయస్ గా పలకరించి.. తెలుగువారి మనసుని ఎటో వెళ్ళిపోయేలా చేసిన అందం.. టబుది. ఇటు దక్షిణాదిలోనూ, అటు ఉత్తరాదిలోనూ అగ్ర తారగా వెలుగొందిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. ఈ ఏడాదితో 50 వసంతాలు పూర్తిచేసుకుంటున్నారు. అయినప్పటికీ మోములో అదే మెరుపుతో గ్లామర్ ప్రియులను అలరిస్తున్నారు. వరుస చిత్రాలతో, విజయాలతో బాక్సాఫీస్ కి ఫేవరేట్ గా కొనసాగుతూనే ఉన్నారు.
రీసెంట్ గా `అంధాధున్`తో హిందీ ప్రేక్షకులను, `అల వైకుంఠపురములో`తో తెలుగువారిని ఆకట్టుకున్న ఈ వెటరన్ యాక్ట్రస్.. త్వరలో బాలీవుడ్ ప్రాజెక్ట్ `భూల్ భులయ్య 2`తో సందడి చేయనున్నారు. కాగా, ఈ సినిమా విడుదలయ్యేలోపే మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట టబు. `ఉజ్దా చమన్` దర్శకుడు, హిందీ `దృశ్యం` నిర్మాతల్లో ఒకరైన అభిషేక్ పతక్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. అంతేకాదు.. ఇదో ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ అని బాలీవుడ్ ఖబర్. ఓ యదార్ధ గాథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ లేదా జూలైలో ప్రారంభం కావచ్చు. టబుతో పాటు మరికొంతమంది ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించబోతున్నారట. మరి.. ఈ సినిమాతో టబుకి ఎలాంటి గుర్తింపు వస్తుందో చూడాలి.