ఆ సినిమా తాప్సీ కెరీర్‌ను టర్న్ చేసింది!
on Dec 4, 2020
టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి సక్సెసయ్యింది పొడుగుకాళ్ల సుందరి తాప్సీ. 'బేబీ' సినిమాలో ఆమె అక్షయ్‌కుమార్‌తో స్క్రీన్ పంచుకుంది. ఆ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ వల్లే ఆమెకు వరుస అవకాశాలు వచ్చి, కంటెంట్ డ్రివెన్ సినిమాలకు కేరాఫ్‌గా మారింది. అంటే, 'బేబీ'తో బాలీవుడ్లో దశ తిరిగిందన్న మాట. అసలు ఈ బేబీ చాన్స్ ఈ ఢిల్లీభామకు ఎలా దక్కిందో తెలుసా? తాప్సీ ఉర్దూ బాగా మాట్లాడుతుంది. అదే ఆమెకు వరమైంది. కథ రీత్యా ఇందులో కథానాయిక ఉర్దూ బాగా మాట్లాడాలి.
అందుకే దర్శకుడు నీరజ్ పాండే.. ఉర్దూ తెలిసిన అందమైన అమ్మాయి కోసం దేశం మొత్తం వెతికాడు. చివరకు బంతి తాప్సీ గోల్లో పడింది. తాను సొగసుగా ఉర్దూ మాట్లాడటం చూసి పులకించిపోయిన నీరజ్... మరో ఆలోచన చేయకుండా ఆ పాత్రకు తాప్సీని ఎంచుకున్నాడు.
దీని గురించి తాప్సీ తెలియజేస్తూ, ‘‘నేను ఉత్తరాది అమ్మాయినే అయినా, ఆ యాస లేకుండా కేవలం ఉర్దూ యాసలోనే మాట్లాడగల సత్తా నాకుంది. చిన్నప్పట్నుంచీ ఉర్దూ మాట్లాడటం నాకు అలవాటే. నీరజ్ ఈ కథ అనుకున్నప్పుడు చాలామందిని కలిశారట. ఉర్దూ మాట్లాడగలిగిన అమ్మాయిలు మాత్రం ఆయనకు తారసపడలేదు. చివరకు నన్ను కలిశారు. కష్టతరమైన కొన్ని ఉర్దూ పదాలను నా ముందుంచారు. నేను అలవోకగా చెప్పేశా. ఆ తర్వాత ఉర్దూ కవితల్ని చదవమన్నారు. తడుముకోకుండా చదివేశా. అలా ఈ సినిమా ఛాన్స్ నాకు దక్కింది. అక్షయ్‌కుమార్, రానా, డ్యానీ... ఇలా చాలామంది స్టార్లు ఇందులో నటించారు. ముఖ్యంగా అక్షయ్ సార్‌తో నటించే ఛాన్స్ రావడం నిజంగా నా అదృష్టం’’ అని వివరించింది. ఒక్కోసారి, ఒక్కో సినిమాతో కెరీర్ దిశ మారిపోతుందనడానికి తాప్సీ కెరీరే నిదర్శనం.
Also Read