ముస్లింల కోసమే ఆ సినిమా చేస్తున్నా- తాప్పీ
on Jul 14, 2018
తాప్సీ టాలీవుడ్లో అడుగుపెట్టి చాలా రోజులే అయ్యింది. కానీ సరైన హిట్ దొరకనేలేదు. కానీ బాలీవు్డలో మాత్రం అదృష్ట దేవత తాప్సీని అక్కున చేర్చుకున్నట్లే ఉంది. పింక్ సినిమాతో అక్కడ తాప్సీకి మంచి పేరే వచ్చింది. కోర్టురూమ్‌లో సాగే ఈ డ్రామా విమర్శకులను బాగానే మెప్పించింది. ఇప్పుడు మరో కోర్ట్‌రూమ్ డ్రామాలో తాప్సీ కనిపించనున్నారు- దాని పేరే ముల్క్! తన మతం కారణంగా తీవ్రవాదిగా ముద్రపడిన ఒక నిర్దోషి తరపున పోరాడే వ్యక్తిగా తాప్సీ నటించనున్నారు. తన మేనేజర్, డ్రైవర్, పనిమనిషి అంతా కూడా ముస్లింలేననీ... వారిని కనుక అనుమానించడం మొదలుపెడితే... తన జీవితం దుర్భరంగా మారిపోతుందని చెప్పుకొచ్చింది. ప్రజల్లో ఉన్న ఇలాంటి అపోహలను దూరం చేయడానికే తాను ఈ సినిమా చేస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.