తాప్సీ జుట్టుకు రంగు పడింది!
on Apr 5, 2020
స్వీయ క్వారంటైన్లో గడుపుతున్న అందాల తార తాప్సీ పన్ను చేసిన ఒక పని బెడిసికొట్టింది. ఆమె తన జుట్టును కత్తిరించేసుకుంది. కారణం.. జుట్టుకు వేసుకున్న రంగు ప్రయోగం వికటించడం! ఇన్‌స్టాగ్రామ్‌లో తన కొత్త ఫొటోను షేర్ చేసిన తాప్సీ, "ప్రయోగం కొనసాగుతుంది.. జుట్టుకు వేసుకున్న రంగు ఎక్కువ రోజులు ఉండకపోవడంతో జుట్టు కత్తిరించేశాను. ఎక్కువ మంది జుట్టు పొడవుగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఇది ఇంటి సేద్యం అని నేను ఫీలవుతాను. నా పంజాబీ జీన్స్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి కత్తిరించేసుకున్నా" అని రాసుకొచ్చింది.
అంతకుముందు, కొత్తగా రంగు వేసుకున్న జుట్టు చూపిస్తూ ఒక వీడియో షేర్ చేసింది తాప్సీ. దానితో పాటు, "నా జుట్టు ప్రయోగాలు! నా జుట్టుతో ఎప్పడూ ప్రయోగాలు చేస్తూనే ఉంటాను. ఎవరూ గమనించరని అనుకుంటూ పన్నెండో క్లాస్‌లో ఉన్నప్పుడు రహస్యంగా నా ఉంగరాల జుట్టును నిఠారుగా చేసుకోవడంతో ఇది మొదలైంది. కొన్నేళ్ల క్రితం బ్లూ, పర్పుల్ రంగులు వేసుకున్నా. బ్లాక్ ఎక్కువగా వేశాను. కొద్ది రోజులు ఇది వినోదంగా అనిపించేది. కానీ ఈ కలర్ మెయిన్టెనెన్స్ అనేది నాకు పీడకలగా తయారైంది" అని పోస్ట్ చేసింది.
ఈ విషయంలో అభిమానులకు ఒక హెచ్చరిక చేసింది. "మీరు ఎక్కువ గంటలు మీ జుట్టుతో కుస్తీపట్టేవాళ్లు కాకపోతే, దీన్ని ఇంట్లో కానీ ఇంకెక్కడా కానీ ప్రయత్నించకండి" అని సూచించింది.
జుట్టు కత్తిరించుకోక ముందు తాప్సీ వేసుకున్న రంగు...
Also Read