చిరు స్కెచ్.. అదిరిపోయిందంతే!
on Apr 2, 2018
సైరా షూటింగ్ మొదలైందో లేదో.. అప్పుడే వార్తల్లోకి ఎక్కేసింది. చిరంజీవి 151వ చిత్రమిది. దానికి తోడు తొలి స్వాతంత్య్ర సమరయోధుడి కథ. స్టార్ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా... బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన కూడా సెట్లో అడుగు పెట్టడం, దానికి సంబంధించిన ఓ స్టిల్ బయటకు రావడం తెలిసిన విషయాలే.
సాధారణంగా ఫస్ట్ లుక్ కోజం అభిమానులు, సినీ జనాలు ఎదురుచూసేలా చేయడం ఓ పద్ధతి. ముందే లుక్ ని లీక్ చేయడం మరో పద్ధతి. చిరు ఇందులో రెండో పద్ధతినే ఎంచుకున్నారు. సైరా నరసింహారెడ్డిగా చిరంజీవి ఎలా కనిపిస్తాడు? అంటూ అభిమానులు అంచనాలు పెంచుకుంటూ వెళ్తే ఇబ్బందని గ్రహించిన చిరు.. ఈ ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ముందే తన లుక్ విషయంలో ఫ్యాన్స్ ని ప్రిపేర్ చేయడంలో భాగంగానే ఫొటో వదిలినట్టు సమాచారం. దాంతో పాటు.. అమితాబ్ ద్వారా ఆ ఫొటో బయటకు వదలడం వెనుక మరో బలమైన కారణం ఉంది. బిగ్ బి..కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దాన్ని ఆసరాగా చేసుకుని బాలీవుడ్లో ఈ సినిమాకి ప్రచారం తీసుకురావాలన్నది చిరు ఆలోచన. అమితాబ్ ట్వీట్ పెట్టగానే.. బాలీవుడ్లో సైరా గురించి చర్చ మొదలైంది. అక్కడ కొన్ని కోట్లు విలువ చేసే పబ్లిసిటీ ఫ్రీగా వచ్చేసింది. బాలీవుడ్ రైట్స్, అక్కడి డిజిటల్ రైట్స్ భారీగా పలకడం ఖాయం అన్న సంకేతాలు ఇప్పటికే చిరు బృందానికి అందేశాయి. చిరు వేసిన ఈ మెగా స్కెచ్ వర్కవుట్ అయిపోయినట్టే.