అతడిని ఆత్మహత్య నుండి కాపాడిన సుశాంత్!
on Sep 14, 2020
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ చేసుకున్నారు. ‘చిచ్చోరే’ సినిమాలో సూసైడ్ అటెంప్ట్ చేసిన కుమారుడికి ధైర్యం చెప్పే తండ్రి పాత్రలో అతడు నటించాడు. అది రీల్ లైఫ్. రియల్ లైఫ్‌లో కూడా ఒక వ్యక్తిని సూసైడ్ నుంచి అతడు కాపాడాడు. సుశాంత్‌కి కొరియోగ్రాఫర్ గణేష్ హివార్కర్ ఫ్రెండ్. ఒక సందర్భంలో తాను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాననీ, తనను సుశాంత్ కాపాడాడని గణేష్ హివార్కర్ చెప్పుకొచ్చాడు.
‘‘అది 2017. నా డ్యాన్స్ క్లాసులకు బ్రోచర్ చేయించాలనే ఐడియా సుశాంత్‌కి వచ్చింది. అప్పట్లో బ్రోచర్లు వంటి విషయాలపై నాకు అవగాహన లేదు. ఐదారుగురు స్టూడెంట్స్‌తో నేను నార్మల్‌గా క్లాసులు రన్ చేసేవాడిని. అప్పుడు షియామక్ దావర్‌తో సుశాంత్ అసోసియేట్ అయ్యాడు. ఎక్కువ మంది స్టూడెంట్స్ డ్యాన్స్ క్లాసులకు రావాలంటే అడ్వర్టైజింగ్ చేయాలని షియామక్ బ్రోచర్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు. బ్రాండింగ్ ఎలా చేయాలో చెప్పాడు. ఓ రాత్రి అంతా కంప్యూటర్ ముందు కూర్చుని నా కోసం బ్రోచర్ డిజైన్ చేశాడు. నా కోసం డబ్బులు ఖర్చుపెట్టాడు’’ అని గణేష్ హివార్కర్ చెప్పాడు.
అనుపమ్ ఖేర్ యాక్టింగ్ అకాడెమీలో డ్యాన్స్ టీచర్‌గా తనకు జాబ్ రావడానికి కూడా సుశాంత్ కారణమనీ, ఒకసారి తనను సూసైడ్ ఎటెంప్ట్ నుంచి కాపాడాడని గణేష్ హివార్కర్ గుర్తు చేసుకున్నాడు.
Also Read