కరెంట్ బిల్లులు కొత్త సినిమా వీకెండ్ కలెక్షన్లలా ఉంటున్నాయ్!
on Jun 30, 2020
కరెంట్ బిల్లులు నిజంగానే కరెంట్ షాక్‌నిస్తున్నాయి చాలా మందికి. అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లుల మోత చూసి సామాన్యుల దగ్గర్నుంచీ సెలబ్రిటీల దాకా అంతా బేజారెత్తి పోతున్నారు. ముంబైలో ఉంటున్న 'పింక్' గాళ్ తాప్పీ దగ్గర్నుంచి చెన్నైలో ఉంటున్న స్నేహ దాకా కరెంట్ బిల్లుల బాధితులే. సాధారణంగా వచ్చే బిల్లుతో పోలిస్తే మే/జూన్ నెల బిల్లు ఆరు నుంచి పది రెట్ల ఎక్కువ మొత్తంలో వస్తుండటం చూసి వాళ్లంతా కళ్లు తేలేస్తున్నారు. మన పొడగరి హీరో సందీప్ కిషన్ అయితే సెటైరికల్‌గా ఈ కరెంట్ బిల్లులను కొత్త సినిమా వీకెండ్ కలెక్షన్లతో పోల్చాడు.
"ఇంట్లో ఎలక్ట్రిసిటీ బోర్డు మీటర్ చూస్తుంటే నా చిన్నతనంలో అనూహ్యమైన ఆటోరిక్షా మీటర్ గుర్తుకొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు! తర్వార ఎవరి ఇంటికి ఎక్కువ బిల్ వచ్చిందని ఆన్లైన్ వార్ స్టార్ట్ అయినా ఆశ్చర్యం లేదు. ఎలక్ట్రిసిటీ బోర్డ్ బిల్లులు కొత్త సినిమాల వీకెండ్ కలెక్షన్లలా ఉంటున్నాయ్" అని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వరా కామెంట్ చేశాడు సందీప్ కిషన్. సెలబ్రిటీలే కరెంట్ బిల్లులను చూసి ఇలా అంటున్నారంటే.. సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే.
Also Read