సుకుమార్ సెంటిమెంట్.. `పుష్ప` బ్రేక్ చేస్తాడా?
on Apr 9, 2021
బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటివరకు 7 సినిమాలు చేశారు. వీటిలో `ఆర్య`, `100% లవ్`, `రంగస్థలం` సక్సెస్ కాగా.. `నాన్నకు ప్రేమతో`, `ఆర్య 2` యావరేజ్ గా నిలిచాయి. `జగడం`, `1 నేనొక్కడినే` ఆశించిన విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి చిత్ర కథానాయకుడు అల్లు అర్జున్ తో `పుష్ప` చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగస్టు 13న పలు భాషల్లో పాన్ - ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది.
ఇదిలా ఉంటే.. సుక్కు ట్రాక్ రికార్డ్ ని గమనిస్తే ఓ విషయం స్పష్టం. అదేమిటంటే.. తనకు ఇప్పటివరకు విజయాన్ని అందించిన మూడు సినిమాలు (ఆర్య, 100% లవ్, రంగస్థలం) కూడా సమ్మర్ సీజన్ లోనే రిలీజయ్యాయి. అలా కాని సినిమాలు పాజిటివ్ రిజల్ట్ ని అందుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలో.. `పుష్ప` రాజ్ అయినా సుకుమార్ సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా? వెయిట్ అండ్ సీ.
కాగా, `పుష్ప`లో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా.. మాలీవుడ్ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.