వాళ్లమ్మకు మాటిచ్చాను- సుకుమార్
on Jan 21, 2019
``సినిమా...సినిమా అని తిరుగుతున్నాడు...మా అబ్బాయి డైరక్టర్ అవుతాడా అయ్యా అని ఓ రోజు బుచ్చిబాబు వాళ్ల మదర్ నన్ను అడిగారు. బుచ్చి బాబు ఏంటో నాకు తెలుసు కాబట్టి...కచ్చితంగా మీ అబ్బాయి డైరక్టర్ అవుతాడని చెప్పాను...ఈ రోజు చాలా గర్వంగా ఉంది. తనను డైరక్టర్ గా చూడటం. వాళ్లమ్మకు ఇచ్చిన మాట నిజమైంది. బుచ్చిబాబు నా సినిమాలకు ఎంతో సపోర్ట్ చేస్తాడు. నేను నా అసిస్టెంట్స్ నుంచి కూడా నేర్చుకుంటుంటాను. నాకు ఒక పట్టాన కథలు నచ్చవు. అలాంటిది ఇంత వరకు తెరపై రానటువంటి కథ చెప్పాడు. చిరంజీవి గారు సైతం కథ విని ఎంతో మెచ్చుకున్నారు. నేను చాలా మంది హీరోలను అనుకున్నా కానీ...బుచ్చిబాబు మాత్రం వైష్ణవ్ నే ఫిక్సయ్యాడు. తనను చూసాక వైష్ణవ్ ఈ సినిమాకు పర్ఫెక్ట్ యాప్ట్ అని అర్థమైంది. వైష్ణవ్ ని కథే సెలక్ట్ చేసుకుంది. తనకు మంచి భవిష్యత్ ఉంటుంది. ఇక దేవిశ్రీప్రసాద్ అయితే కథ విని చాలా ఎగ్జయిట్ అయ్యాడు. తనకి కథ నచ్చితే ఎలాంటి పాటలు ఇస్తాడో తెలిసిందే. కాబట్టి ఈ సినిమా ఆడియో హిట్ అవుతుందనడంలో సందేహం లేదన్నారు.