ENGLISH | TELUGU  

కులాలు.. మతాల ప్రస్తావన ఎందుకు?: సుదీప్

on Oct 12, 2018

తమ కులానికి చెందిన నాయకుడు అనీ, తమ మతానికి చెందిన వ్యక్తి అనీ ఓటేసే ప్రజలు మన దేశంలో వున్నారు. తమ కులానికి చెందిన కథానాయకుడు అనీ, ఆ నటుడిది తమ మతమనీ సినిమాలను ఆదరించే ప్రేక్షకులు, అభిమానులు కూడా మన భారతదేశంలో వున్నారు. తెలుగు రాష్ట్రాలకు సరిహద్దు రాష్ట్రమైన కర్ణాటకలోనూ కులాల ప్రాతిపదికన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు, కథానాయకులను అభిమానించే ప్రజలు వున్నారు. అందువల్ల నటుడు సుదీప్ ఇబ్బందికర పరిస్థితుల్లో పడ్డారు. అసలు వివరాల్లోకి వెళితే... కర్ణాటకలో ఒకప్పుడు మడకరి నాయక అని రాజు చిత్రదుర్గ ప్రాంతాన్ని పరిపాలించాడు. నాయక రాజుల్లో అతడే చివరివాడు. అతని కథ ఆధారంగా కన్నడలో రెండు సినిమాలు రూపొందుతున్నాయి.

ఒక సినిమాలో హీరో సుదీప్ నటిస్తుండగా, మరో సినిమాలో దర్శన్ హీరో. ఇద్దరిలో సుదీప్ నాయక సామజిక వర్గానికి చెందినవాడు. ఈ నేపథ్యంలో సుదీప్ మాత్రమే మడకరి నాయక జీవితం ఆధారంగా సినిమా చేయాలని, మరొకరు సినిమా చేస్తే తమ సామాజిక వర్గ ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని ఒక స్వామిజీ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దాంతో సుదీప్ స్పందించక తప్పలేదు. సినిమాల నుంచి కులాలను... మతాలను పక్కన పెట్టమని అభిమానులకు సుదీప్ ఒక లేఖ రాశారు. సినిమాయే ఒక మతమని ఆయన పేర్కొన్నారు. సినిమాను సినిమాగా చూడమని, కులాలతో ముడిపెట్టవద్దని ఆయన ప్రేక్షకుల్ని కోరారు. ప్రజల కోసం సినిమాలు తీస్తున్నామని, లెజెండ్ మడకరి నాయక జీవితానికి రెండు సినిమాలు న్యాయం చేస్తాయని ఆశిస్తున్నానని సుదీప్ అన్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.