సాంగ్ టాక్: నా పేరు సూర్య
on Jan 26, 2018
తన మార్క్ రైటింగ్‌తో స్టార్ రైటర్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకుని స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిస్తోన్న మూవీ నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా. అల్లు అర్జున్న ఎగ్రెసివ్ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌తో టాలీవుడ్లో ఫస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన బన్నీ తన మూవీని మోస్ట్ ఎవెయిటేడ్ మూవీగా మార్చుకున్నాడు. స్టోరీ బేస్ లైన్ అంతా సైనికులు, దేశ భక్తి చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుండటంతో రిపబ్లిక్ డే నాడు ఈ సినిమాలో సైనికుల గురించి రాసిన పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
సరిహద్దున నువ్వు లేకుంటే ఏ కనుపాప కంటినిండుగా నిదురపోదురా నిదురపోదురా పాటలోని ప్రతి పల్లవిలో సైనికుల గొప్పదనం.. వారు దేశానికి చేసిన సేవను కీర్తిస్తూ అద్భుతంగా సాగింది పాట. ముఖ్యంగా విశాల్ శేఖర్ మ్యూజిక్ రోమాలను నిక్కపొడుచుకునేలా చేసింది. భావోద్వేగం నిండిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. రిపబ్లిక్ డే కావడంతో ఇప్పటికే చాలా మంది ఈ పాటను కాలర్ ట్యూన్‌గా సెట్ చేసుకున్నారు. లగడపాటి శ్రీధర్, బన్నీవాసు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో బన్నీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. సమ్మర్ కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.