నటునిగా మోహన్‌బాబు బలాలేమిటో తెలుసా?
on Sep 29, 2020
యాక్టర్లు ఎంతమందో ఉంటారు. కానీ అన్ని రసాలు సమపాళ్లలో రంగరించి నటించే నవరస నటులు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండే నటుడు మోహన్‌బాబు. విలన్‌గా ముఖంగా క్రూరత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించే ఆయన, అదే క్రూరత్వంలో కామెడీని కూడా మిక్స్ చేసి వహ్వా అనిపించగల విలక్షణ నటుడు మోహన్‌బాబు. మొదట డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుండి నటుడిగా మారి విలన్ గిరికి ఎదిగి, అక్కడి నుంచి హీరోగా ఒకానొక దశలో టాప్ రేంజికి చేరుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అది ఆయనకే చెల్లింది.
కావాల్సినంత ఎత్తు, వినసొంపైన డైలాగ్ డెలివరీ సొంతం చేసుకున్న మోహన్‌బాబు హీరోగా నటిస్తూ కామెడీతో పలికే ఊతపదాలు, మేనరిజాలు ఇటు మాస్‌నీ, అటు క్లాస్‌నీ ఉర్రూతలూగించాయి. అయితే ఆయన సినిమాల్లో డబుల్ మీనింగ్స్ ఉంటాయనే విమర్శ లేకపోలేదు. ప్రొడ్యూసర్‌గా మోహన్‌బాబు ఎన్నో విజయాలు సాధించారు. టాప్ స్టార్స్ సినిమాలతో పాటు తన సినిమాలను ధైర్యంగా రిలీజ్ చేసి బ్లాక్‌బస్టర్స్ అందుకున్నారు. హీరోగా తన ప్రతిభను తన సొంత చిత్రాల ద్వారానే ఎక్కువగా రుజువు చేసుకున్నారు. కొన్ని సినిమాలు ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేశాయి. అన్ని సినిమాలూ ఆయనను డైలాగ్ కింగ్‌గా నిరూపించాయి. ఇప్పుడు తనకు బాగా నచ్చిన పాత్రలనే ఎంపిక చేసుకుంటూ నటుడిగా తన పయనాన్ని కొనసాగిస్తున్నారు మోహన్‌బాబు.
Also Read