ఫ్లాష్‌బ్యాక్: రైన్ సాంగ్స్ క్వీన్
on Aug 6, 2020
సిల్వర్ స్క్రీన్‌పై వాన పాటలకు ఉన్న క్రేజే వేరు. తెరపై నాయిక అందాలు తడిసి ముద్దవుతుంటే చూసే కుర్రకారు థియేటర్లలో ఈలలేసి గోల చేస్తుంటారు. మాస్ ఎట్రాక్టివ్ ఫార్ములాల్లో వాన పాటలదే పెద్దపీట. అందాల నాయికగా తెరమీద వెలుగు వెలిగిన శ్రీదేవి కూడా పలు రెయిన్ సాంగ్స్‌లో నటించారు. 'వేటగాడు' చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఆమె ఆడి పాడిన 'ఆకు చాటు పిందె తడిసె' పాట అప్పట్లో ఓ సంచలనం.
శోభన్‌బాబుతో 'కోడె త్రాచు' మూవీలో 'ఇరుకులో పడ్డావే రైకమ్మత్'త పాటలో నర్తించారు శ్రీదేవి. కృష్ణ సరసన 'కంచు కాగడా' సినిమాలో 'వైశాఖ మాసాన వయసొచ్చెనమ్మా' పాటలో ఒక ఊపు ఊపేశారు. వారిద్దరి కాంబినేషన్లోనే వచ్చిన 'అదృష్టవంతుడు' చిత్రంలో 'చినుకు చినుకు పడుతోంది చిలిపి వానగా', 'మామా అల్లుళ్ల సవాల్'లో 'చిటుక్కు చిటుక్కు చిటుక్కు చిటుక్కు చినికిందీ వానా' పాటలు ప్రేక్షకుల్ని అలరించాయి.
అక్కినేని నాగార్జునతో 'ఆఖరి పోరాటం' చిత్రంలో 'స్వాతి చినుకు సందె వేళలో' అనే రెయిన్ సాంగ్‌లో శ్రీదేవిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపించిన అనుభవం మనది. అలాగే హిందీ, తమిళ సినిమాల్లోనూ పలు రెయిన్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను తన సౌందర్యంతో మెస్మరైజ్ చేశారు శ్రీదేవి.
Also Read