English | Telugu

శ్రీదేవి గురించి మీకు తెలియని విషయాలు

on Feb 25, 2018

దశాబ్దాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమను రారాణిగా ఏలిన అందాల తార, అతిలోకసుందరి శ్రీదేవి కన్నుమూశారు. బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన దగ్గరి నుంచి లేడి సూపర్‌స్టార్‌గా ఎదిగిన క్రమంలో ఆమె జీవితంలో ముఖ్య ఘట్టాలు మీకోసం.

* శ్రీదేవి తండ్రి న్యాయవాదిగా పనిచేశారు.. ఆమెకు ఒక సోదరి.. ఇద్దరు సవతి సోదరులు ఉన్నారు.

* నాలుగేళ్ల ప్రాయంలోనే శ్రీదేవి బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టారు.

* 1976లో తమిళ సినిమా మందరూ ముదిచిలో తొలిసారి హీరోయిన్‌గా నటించారు.

* 1978లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పదహారేళ్ల వయసు ఆమెకు తెలుగులో హీరోయిన్‌గా తొలి చిత్రం.

* బాలనటిగా బడిపంతులుతో ఎన్టీఆర్‌తో మనమరాలిగా చేసిన శ్రీదేవి.. 16 ఏళ్ల ప్రాయంలో అదే ఎన్టీఆర్‌‌తో వేటగాడులో హీరోయిన్‌గా నటించారు. ఆ సినిమాలోని ఆకుచాటు పిందె తడిసె పాట బాగా ఫేమస్.

* సూపర్‌స్టార్ రజనీ పక్కన హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి.. మూండ్రు ముదిచులో ఆయనకు సవతితల్లిగా నటించారు. ఆ సినిమా సమయానికి శ్రీదేవి వయసు 13 సంవత్సరాలు.

* శ్రీదేవి వయసు 54 సంవత్సరాలైతే... ఆమె సినీ కెరీర్ 50 ఏళ్లు.

* మూడు తరాల హీరోలతో నటించిన ఏకైక కథానాయక భారతీయ చిత్ర పరిశ్రమలో శ్రీదేవి ఒక్కరే. 

* అప్పట్లో శ్రీదేవి నటించింది సీనియర్‌ హీరోలతోనే. ఎన్టీఆర్‌తో ‘కొండవీటి సింహం’, ‘సర్దార్‌ పాపారాయుడు’, ‘బొబ్బిలి పులి’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించారామె. ఏయన్నార్‌తో ‘ప్రేమాభిషేకం’, శోభన్‌బాబుతో ‘కార్తీక దీపం’తో పాటు అప్పటి సీనియర్‌ హీరోలు కృష్ణ, కృష్ణంరాజులతోనూ నటించారు.

* శ్రీదేవికి అలనాటి హీరో మిథున్ చక్రవర్తితో రహస్య వివాహం జరిగిందన్నది నేటీకి మిస్టరీనే. వీరిద్దరు కొంతకాలానికే వీడిపోయారని.. ఆ తర్వాత బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను శ్రీదేవి పెళ్లి చేసుకున్నారు.

* ఒక క్యారెక్టర్‌లో పర్ఫెక్షన్ శ్రీదేవి ఎంతో కష్టపడతారు. "రూప్‌కి రాణి చోరోం కా రాజా" సినిమాలో "దుష్మన్ దిల్ కా వో హై" పాట కోసం 25 కేజీల బరువైన గోల్డెన్ డ్రెస్ ధరించి.. పదిహేను రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here