శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారా?
on Apr 4, 2018
సోషల్ మీడియా తాజా సంచలనం శ్రీరెడ్డిని అరెస్టు చేస్తారా? ఆ అవకాశాలున్నాయా? - ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తి రేకెత్తిస్తున్న ప్రశ్నలివే. ఈమధ్య సోషల్ మీడియా సాక్షిగా శ్రీరెడ్డి రెచ్చిపోయి కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది పేర్లు ప్రత్యక్షంగా, మరి కొంతమంది పేర్లని పరోక్షంగా బయటకు లాగి.. వాళ్లని ఇరకాటంలో పెట్టింది. ఏ అమ్మాయి నోటి నుంచి వినలేని, వినకూడని మాటలన్నీ శ్రీరెడ్డి నోట్లోంచి వినిపిస్తున్నాయి. ఫిల్మ్ స్టూడియోలను బ్రోతల్ హౌస్‌లతో పోలుస్తూ పేల్చిన కామెంట్లు టాలీవుడ్‌ని షేక్ చేశాయి. నిన్నటికి నిన్న.. శేఖర్ కమ్ములపై ఆమె విసిరిన కామెంట్లు.. హాట్ టాపిక్‌గా మారాయి. వీటిపై శేఖర్ కమ్ముల స్పందించడం, కేసు పెడతా అని బెదిరించడం తెలిసిందే. శేఖర్ కమ్ములకు కొంతమంది సినీ ప్రముఖులు సపోర్ట్‌గా నిలిచారని సమాచారం. వీళ్లంతా కలసి శ్రీరెడ్డిపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. శ్రీరెడ్డి ఎప్పుడు దొరుకుతుందా? ఎలా ఇరకాటంలో పెడదామా? అని కొంతమంది ఎదురు చూస్తున్నారు. వాళ్లకు శ్రీరెడ్డి తనకు తానుగా అవకాశం ఇచ్చింది. శేఖర్ కమ్ములపై నిరాధారమైన కామెంట్లు చేసి అడ్డంగా దొరికిపోయింది. ఈ ఇష్యూని శేఖర్ కమ్ముల వదిలేట్టు కనిపించడం లేదు. దానికి తోడు ఈమధ్య సోషల్ మీడియాపై పోలీసులు గట్టిగానే దృష్టి పెట్టారు. తప్పుడు సమాచారం అందించినా, శ్రుతి మించి కామెంట్లు చేసినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు వాళ్ల దృష్టి శ్రీరెడ్డిపైన పడిందని తెలుస్తోంది. ఒక్కరు ఫిర్యాదు చేసిన చాలు.. అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధమయ్యార్ట. శ్రీరెడ్డిని కాస్త కంట్రోల్లో పెట్టాలన్నా.. ఈ స్టెప్పు తప్పని సరి అని చిత్రసీమలోని కొంతమంది పెద్దలు భావిస్తున్నారట. ఎలా చూసినా.. శ్రీరెడ్డి ఇరకాటంలో పడినట్టే.
Also Read