మీకు చూడాలనిపిస్తే చూడండి.. లేకపోతే లేదు!
on Apr 5, 2020
మెడలో మూడు ముళ్లు వేయించుకుని, ఏడడుగులు వేయడానికి తొందర ఎందుకని బుల్లితెర రాములమ్మ శ్రీముఖి ప్రశ్నిస్తోంది. ప్రేక్షకులతో సామాజిక మాధ్యమాలు (ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్)లో హీరోయిన్లు ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు నిర్వహిస్తే 'పెళ్లి ఎప్పుడు?' అనే ప్రశ్న తప్పకుండా ఎదురవుతోంది. యాంకర్లకు కూడా తప్పడం లేదని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో శ్రీముఖి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. 'పెళ్లి సంగతి ఏంటి?' అని ఒకరు ప్రశ్నించారు. 'వై తొందర....' అన్న శ్రీముఖి, మిగతా ప్రశ్నలకు ఏం సమాధానాలు ఇచ్చారంటే...
- అక్కా.... రోజూ ఇంట్లో ఏం చేస్తున్నారు?
క్లీనింగ్... దుమ్ము దులపడం, ఇల్లు తుడవడం, మాప్ కొట్టడం! తినడం, అంట్లు తోమడం. వాషింగ్ మెషీన్ లో వేయడం. సినిమాలు, వెబ్ సిరీస్ లు చూడడం. నెక్స్ట్ డే మెనూ, మోడీజీ టాస్క్ ఏంటి అని ఆలోచించడం... చాలా చేస్తున్నాలే.
- క్వారంటైన్ టైమ్‌లో ఎన్ని వెబ్ సిరీస్‌లు కంప్లీట్ చేశారు?
షి, లాకి అండ్ కీ, పంగా, మస్కా, పుష్పవల్లి. యాక్చువల్లీ... ఇంకా చాలా చూశా.
- పుస్తకాలు చదువుతారా? సినిమాలు చూస్తారా?
ఒకప్పుడు పుస్తకాలు చదివేదాన్ని. ఇప్పుడు సినిమాలు చూస్తున్నా. మళ్ళీ ఒకప్పుడు సమయానికి వెళితే బావుంటుందని ఆశిస్తున్నా.
- ఇంట్లో అన్ని పనులు చేస్తున్నా మీకు సిరీస్ చూసే టైమ్ ఉంటుందా?
లేట్‌గా పడుకుంటున్నా. లేట్‌గా లేస్తున్నా.
- మేడమ్... షూటింగ్ కి పోలేదా?
లాక్ డౌన్ అయిపోయిందా? ఏంది తమ్ముడు నీ పిచ్చి ప్రశ్న!
- అక్కా.... క్వారంటైన్ టైమ్‌లో కూడా మేకప్ వేసుకుంటున్నావా?
చందు రెడ్డి... నీకు మేకప్ ఏడ కనిపిస్తుంది? అయినా మా ఇష్టం అబ్బా! మేకప్ వేసుకోవాలి అనిపిస్తే వేసుకుంటాం. లేదంటే లేదు. మీకు చూడాలనిపిస్తే చూడండి. లేకపోతే లేదు.
- మీ 'బిగ్ బాస్' టాటూ రియలేనా?
టాటూ ఈజ్ ఫర్ రియల్..
- బాగా కోపం వచ్చినప్పుడు చేసే మొదటి మూడు పనులు?
వాట్సాప్ బ్లాక్ చేయడం, గట్టిగా అరవడం, మౌనంగా ఉండడం.
- పెళ్లి ఫిక్ అయితే పిలుస్తావా?
తప్పకుండా (నాకు సిగ్గేస్తుంది అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు).
- దుబాయ్ / మాల్దీవ్స్?
మాల్దీవ్స్
- చికెన్ / మటన్?
చికెన్. ఐ హేట్ మటన్. టోటల్లీ హేట్
- మీకు సెక్స్ ఇష్టమా?
చెత్త ప్రశ్నలకు నేను ఎప్పుడూ స్పందించను. కానీ, ఆ అకౌంట్ ని రిపోర్ట్ చేయవచ్చు కదా! నిజమేగా? నవీన్ చౌదరి గుంటుపల్లి (ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీముఖిని ఈప్రశ్న అడిగిన వ్యక్తి) మెంటల్ హెల్త్ బాగుండాలని నేను ప్రార్థిస్తున్నా. త్వరగా కోలుకో.