"స్పైడర్" ,"జై లవకుశ".. దొందూ… దొందే
on Sep 7, 2017
ఈ మధ్య సినిమాలు ఎలా ఉన్నాయంటే.. ఆడియో హిట్ అయిందంటే సినిమా సగం హిట్ అయినట్టే. ఆడియో హిట్ కాకపోతే.. సినిమాపై కూడా డౌట్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అదే పరిస్థితిలో పడ్డాయి రెండు పెద్ద హీరోల సినిమాలు. ఆ రెండు సినిమాలు ఏంటనుకుంటున్నారా...? మహేశ్ సినిమా "స్పైడర్", ఎన్టీఆర్ నటించిన "జై లవకుశ". స్పైడర్ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తుండగా... జై లవకుశ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక "జై లవకుశ" ఆడియో ఇప్పటికే విడుదలవ్వగా.. స్పైడర్ సినిమాలో రెండు పాటలు విడుదలయ్యాయి. కానీ ఆడియో అంతగా అలరించినట్టు కనిపించడంలేదు. సినిమాలోని మొదటి పాట ‘బూమ్ బూమ్’ శ్రోతలను నిరాశపరిచగా.. ఆ తరువాత రెండవ పాట ‘పుచ్చకాయ పుచ్చకాయ’ అనే ఈ పాట కూడా అంచనాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు. ఈ రెండు పాటలు నిరాశపరిచాయి. రెండు పాటలలో కూడా తెలుగుదనం పూర్తిగా లోపించాయి. దర్శకుడు మురుగదాస్ తమిళ ట్యూన్స్ ను రికార్డు చేయించి, తెలుగు రచయితల చేత రాయించినట్లుగా అర్ధమవుతోంది. దీంతో మిగిలిన పాటలు కూడా ఎలా ఉంటాయో అన్న అంచనాకు వచ్చేశారు. ఇక తన మ్యూజిక్ తో అందరినీ ఆకట్టుకునే దేవీ కూడా "జై లవకుశ" సినిమాలో పాత ట్యూన్స్ నే అటు తిప్పి ఇటు తిప్పి అందించినట్టు తెలుస్తోంది. దేవీ మ్యూజిక్ లో ఉండే మ్యాజిక్ ఈ పాటల్లో లేదు. దీంతో ఈ రెండు ఆల్బమ్స్ కూడా “దొందూ… దొందే…” అన్న చందంగా తయారయ్యాయి. మరి ఆడియో పరంగా అయితే రెండు సినిమాలు నిరాశపరిచాయి... మరి సినిమాలు ఎలా ఉంటాయో చూద్దాం..