20 ఎక్కువా..90 ఎక్కువా మహేశా..?
on Sep 15, 2017
సినిమాను ఎంత బాగా తీశామన్నది కాదు..దానిని ఎంత బాగా మార్కెట్ చేశామన్న దానిపైనే ఆ సినిమా కలెక్షన్స్ ఆదరపడతాయి అన్నది ఎన్నో సార్లు రుజువైన మాట. భారతీయ సినిమాను గర్వపడే రేంజ్లో బాహుబలిని తీసిన రాజమౌళి తన మార్కెటింగ్ స్ట్రాటజీతో అద్భుతమైన వసూళ్లు సాధించేలా చేశారు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనమార్క్ కాంట్రవర్సీలతో సినిమాలకు బజ్ తీసుకువస్తారు..ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మురుగదాస్ కాంభినేషన్లో మహేశ్ బాబు నటిస్తోన్న స్పైడర్ మూవీకి పబ్లిసిటీ విషయంలో పాస్‌మార్కులు కూడా పడటం లేదని ఫిలిం క్రిటిక్స్ చెబుతున్న మాట.
ఆకట్టుకునే ఆడియో లేకపోవడం..టీజర్, ట్రైలర్లకు అంతంత మాత్రం రెస్పాన్స్ వస్తుండటం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పటికే మురుగదాస్ మీడియాతో మాట్లాడేసారు..మహేశ్ బాబు కేవలం నాలుగంటే నాలుగే రోజులు మాత్రమే ప్రమోషన్స్‌కు కేటాయించినట్లు టాక్. అయితే తమిళ్ వెర్షన్ ప్రమోషన్ మాత్రం ఊదరగొట్టేస్తున్నారట..అక్కడి మీడియాలో స్పైడర్‌కు సంబంధించిన ఏదో ఒక విషయం ఉండేలా మురుగదాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. నిజానికి తమిళ వెర్షన్ విలువ..రూ.20 కోట్లు మాత్రమే..అదే సమయంలో తెలుగు వెర్షన్ విలువ రూ.90 కోట్లు..మరి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి..ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన మహేశ్ కూడా ఏ మాత్రం స్పందించకపోతే ఎలా..? ఇలాగైతే తమ పరిస్థితి ఏంటి అని తెలుగు నాట బయ్యర్లు భయపడుతున్నారట.