ట్రైలర్ రివ్యూ: స్పైడర్
on Sep 15, 2017
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంభినేషన్లో తెరకెక్కుతున్న స్పైడర్ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. రీసెంట్గా నిన్న అర్థరాత్రి ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. నా పేరు శివ..ఇదే నా ఆఫీస్..ఫోన్లో ఎవరైనా బెదిరించినా, ఏడ్చినా, హెల్ప్ అని అన్నా..నా సాఫ్ట్వేర్ ఆన్ అయి స్క్రీన్ బ్లింక్ అవుతుంది.. అంటూ మహేశ్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఎప్పటి లాగే హ్యాండ్సమ్ లుక్‌లో ప్రిన్స్ మెరిసిపోతున్నాడు. యాక్షన్..లవ్..ఎమోషన్ సీన్స్ బాగున్నాయి..హ్యారీష్ జై రాజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో మహేశ్‌తో రకుల్ ప్రీత్ సింగ్ ఆడిపాడుతోంది. దసరా కానుకగా సెప్టెంబర్ 27న స్పైడర్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది.