హాస్పిటల్లో వ్యాయామం చేస్తున్న బాలు చివరి వీడియో వైరల్!
on Sep 26, 2020
కోకిల ఏ కొమ్మనుంచి పాడినా సుమధురంగానే ఉంటుందన్నట్లు ఎలాంటి పాట పాడినా వహ్వా అనిపించిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇవాళ అమరగాయకుడిగా మారిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం 1:04 గంటలకు ఆయన స్వర్గస్తులయ్యారని బాలు తనయుడు చరణ్ ప్రకటించగానే కోట్లాది అభిమానుల గుండెలు పగిలాయి. ఒక గాయకుడి మరణానికి దేశవ్యాప్తంగా ఈ స్థాయి విషాదం నెలకొనడం ఇప్పుడే చూస్తున్నాం. ఇప్పటికీ ఆయన మన మధ్య లేరనే వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టంగానే అనిపిస్తోంది.
కాగా, హాస్పిటల్లో తీసిన చివరి వీడియో అంటూ ఆన్లైన్లో బాలుకు చెందిన వీడియో వైరల్ అయ్యింది. అందులో ఆరోగ్య స్థితి మెరుగవడానికి బాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నిస్తుండగా, హాస్పిటల్ సిబ్బంది మరికాస్త చెయ్యమని ఆయనను ప్రోత్సహించడాన్ని ఆ వీడియోలో మనం చూడొచ్చు. దానిని చూస్తూ అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అదివరకు ఏ రోజుకారోజు తన తండ్రి ఆరోగ్య స్థితి గురించి పంచుకుంటూ వచ్చిన చరణ్.. ఆయన వ్యాయామం కూడా చేస్తున్నారనీ, ఆయన పరిస్థితి మెరుగవుతోందని చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని బాధపడుతున్నారు.
Also Read